Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mukesh33d45f47-e41c-48dc-a04e-d654c83b9275-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mukesh33d45f47-e41c-48dc-a04e-d654c83b9275-415x250-IndiaHerald.jpgటీమిండియాలో యువ ఆటగాళ్లకు కొరత లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు దేశవాళి టోర్నీలు ఐపీఎల్ ద్వారా కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉండగా.. ఈ పర్యటనలో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కి ఇక భారత జాతీయ జట్టు తరఫున ఆడే ఛాన్స్ దొరికింది. ఇలా ఛాన్స్ దక్కించుకున్న వారిలో బెంగాల్ ఫేసర్ ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ తో ముఖేష్ Mukesh{#}sourav ganguly;2020;Traffic police;Service;Yuva;Mukesh;Bihar;West Indies;West Bengal - Kolkata;police;Father;INTERNATIONAL;Google;Cricket;Indiaపోలీస్ అవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే టీమిండియాలో ఛాన్స్?పోలీస్ అవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే టీమిండియాలో ఛాన్స్?Mukesh{#}sourav ganguly;2020;Traffic police;Service;Yuva;Mukesh;Bihar;West Indies;West Bengal - Kolkata;police;Father;INTERNATIONAL;Google;Cricket;IndiaSat, 22 Jul 2023 19:30:00 GMTటీమిండియాలో యువ ఆటగాళ్లకు కొరత లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు దేశవాళి టోర్నీలు  ఐపీఎల్ ద్వారా కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉండగా.. ఈ పర్యటనలో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్  కి ఇక భారత జాతీయ జట్టు తరఫున ఆడే ఛాన్స్ దొరికింది. ఇలా ఛాన్స్ దక్కించుకున్న వారిలో బెంగాల్ ఫేసర్ ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ తో ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.


 అయితే దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు అతను ఎంపిక అవుతున్నాడు. కానీ ప్లేయింగ్ ఎలెవన్ లో మాత్రం అతనికి చోటు దక్కటం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో రెండో టెస్ట్ కు ఫేసర్ శార్దూల్ ఠాగూర్ దూరం కావడంతో ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమం అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోని ముఖేష్ కుమార్  గురించి తెలుసుకోవాలని అటు ఇండియా ఫ్యాన్స్ కూడా గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. ఇక కాస్త వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల ముఖేష్ కుమార్ 1998లో బీహార్ లోని గోపాల్ గంజ్ లో జన్మించాడు.


 అయితే పోలీస్ అవ్వాలనుకున్న ముఖేష్ కుమార్ చివరికి టీమిండియా క్రికెటర్ గా మారాడు. అతని తండ్రి ఒక టాక్సీ డ్రైవర్. మొదట మిలిటరీ లేదా పోలీసు ఉద్యోగంలో చేరి దేశానికి సేవ చేయాలనీ అనుకున్నాడు. అయితే 2012లో నిర్వహించిన సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బీహార్ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలను కూడా క్లియర్ చేశాడు ముఖేష్. కాని పోషకాహార లోపం కారణంగా మోకాళ్ళ నొప్పుల కారణంగా పరీక్షల్లో నెగ్గ లేకపోయాడు. ఆ సమయంలోనే తండ్రి సూచన మేరకు క్రికెట్ వైపు అడుగులు వేశాడు. సొంత రాష్ట్రం బీహార్ లో అవకాశాలు తక్కువ ఉండడంతో.. వెస్ట్ బెంగాల్ కు తన మకాం మార్చాడు. అక్కడికి వెళ్ళాక కోల్కతాలోనే బనీ నికేతన్ స్పోర్ట్స్ క్లబ్లో భీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. బెంగాల్ డివిజన్ లీగ్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన అనంతరం 2014 సౌరవ్ గంగూలీ విజన్ 2020 ప్రోగ్రాం కు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో అతనికి ఛాన్స్ దక్కింది.  దీంతో బెంగాల్ రాష్ట్ర  జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేసాడు  2017 బెంగాల్ రాష్ట్రం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగు పెట్టిన ముఖేష్ కుమార్.  ఇక ఆ తర్వాత కాలంలో ఐపీఎల్లో ఛాన్స్ తగ్గించుకున్నాడు. ఇక తన ప్రదర్శన చూసి సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు.



RRR Telugu Movie Review Rating

రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>