MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh400fc1ea-2815-42e9-bda7-c00753b56e69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh400fc1ea-2815-42e9-bda7-c00753b56e69-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో రాజకీయాల నేపధ్యం చాల తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్ టైన్మెంట్ అతడి సినిమాలలో ఎక్కువగా ఉంటాయి. అయితే మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ మూవీని మాస్ మసాల సినిమాగా తీస్తున్న పరిస్థితులలో ఈమూవీలో రాజకీయాల ప్రస్తావన కూడ ఎక్కువగా ఉంటుందని టాక్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు వైర వెంకటస్వామి. వయసు 80 సంవత్సరాలు. జనదళం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆపార్టీ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. అతడికి ప్రధాన ప్రత్యర్థి జగపతి బMAHESH{#}Prakash Raj;jagapati babu;ramya krishnan;thaman s;trivikram srinivas;Sangeetha;Mass;CBN;Athadu;Hero;Newsగుంటూరు కారంలో రాజకీయం !గుంటూరు కారంలో రాజకీయం !MAHESH{#}Prakash Raj;jagapati babu;ramya krishnan;thaman s;trivikram srinivas;Sangeetha;Mass;CBN;Athadu;Hero;NewsSat, 22 Jul 2023 08:00:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో రాజకీయాల నేపధ్యం చాల తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్ టైన్మెంట్ అతడి సినిమాలలో ఎక్కువగా ఉంటాయి. అయితే మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ మూవీని మాస్ మసాల సినిమాగా తీస్తున్న పరిస్థితులలో ఈమూవీలో రాజకీయాల ప్రస్తావన కూడ ఎక్కువగా ఉంటుందని టాక్.  


ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు వైర వెంకటస్వామి. వయసు 80 సంవత్సరాలు. జనదళం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆపార్టీ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. అతడికి ప్రధాన ప్రత్యర్థి జగపతి బాబు జాలి దయా ఏకోశానా లేని పరమ దుర్మార్గుడుగా అతడి పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వీళిద్దరి మధ్య జరిగే యుద్ధంలో హీరో మహేష్ బాబు ప్రవేశిస్తాడు.


ఈమూవీలో రమ్యకృష్ణ ది మరొక పవర్ ఫుల్ పాత్ర అని తెలుస్తోంది.  ఆపాత్రకు సెపరేట్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందట. ఈ మసాల కథకు త్రివిక్రమ్ మార్క్ తో ఫ్యామిలీ ఎటాచ్మెంట్స్  జోడించి త్రివిక్రమ్ తన స్టైల్ లో ఈకథను అల్లినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నటించినందుకు మహేష్ కు 75 కోట్లు ఈమూవీకి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ కు 30 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఈమూవీ ప్రాజెక్ట్ కాస్ట్ 150 కోట్లు దాటిపోవడంతో ఈమూవీ పై 200 కోట్లకు పైగా బిజినెస్ చేయాలని ఈమూవీ నిర్మాతల ఆలోచన అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈమూవీ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాను ఎట్టి పరిస్థితుల్లో రాబోతున్న సంక్రాతికి విడుదల చేసి తీరాలి అన్న పట్టుదలతో త్రివిక్రమ్ పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈమూవీలో అతడు ట్యూన్ చేసే పాటలు అందరికీ నచ్చాలి అన్న పట్టుదలతో తమన్ చాల శ్రద్ధతో ఈమూవీ ట్యూన్స్ కంపోజింగ్ విషయంలో చాల శ్రద్ధ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..





RRR Telugu Movie Review Rating

గుంటూరు కారంలో రాజకీయం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>