LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/soaked-badamac395b24-723b-4f44-b4cd-36303524f3ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/soaked-badamac395b24-723b-4f44-b4cd-36303524f3ee-415x250-IndiaHerald.jpgసాధారణంగా బాదాం మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా పిల్లలకు బాదాం పెట్టడం వల్ల,వారి శారీరక పెరుగుదలే కాక జ్ఞాపక శక్తి పెరుగుదకు కూడా దోహదపడుతుంది. అటువంటి ప్రయోజనాలు కలిగిన బాదాంను నానబెట్టి,రోజూ పరగడుపున తీసుకోవడంతో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.అవేంటో మనం తెలుసుకుందామా.. SOAKED BADAM{#}Almonds;Insulin;Cholesterol;Manam;Sugar;Vitamin;Shaktiరోజూ పరగడుపున నానబెట్టిన బాదాం తింటే ఏమవుతుందో తెలుసా..?రోజూ పరగడుపున నానబెట్టిన బాదాం తింటే ఏమవుతుందో తెలుసా..?SOAKED BADAM{#}Almonds;Insulin;Cholesterol;Manam;Sugar;Vitamin;ShaktiSat, 22 Jul 2023 19:00:00 GMTసాధారణంగా బాదాం మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా పిల్లలకు బాదాం పెట్టడం వల్ల,వారి శారీరక పెరుగుదలే కాక జ్ఞాపక శక్తి పెరుగుదకు కూడా దోహదపడుతుంది. అటువంటి ప్రయోజనాలు కలిగిన బాదాంను నానబెట్టి,రోజూ పరగడుపున తీసుకోవడంతో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.అవేంటో మనం తెలుసుకుందామా..

జీర్ణక్రియశక్తి పెంపోందిస్తుంది..
నానబెట్టిన బాదంపప్పులను రోజూ తినడంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.ఇది పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేకురుస్తుంది.దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట బాగా శుభ్రపడి,గ్యాస్,ఉబ్బరం,మలబద్ధకం,పొట్ట నొప్పి, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు.

చర్మ ఆరోగ్యానికి..
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది.అంతేకాక  బాదంలో అనేక రోగనిరోధక లక్షణాలు ఉన్నాయి. ఏది చర్మాన్ని బ్యాక్టీరియల్ మరియు పంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.ముఖ్యంగా వీటిని రోజు తీసుకోవడం వల్ల పొడి చర్మం సమస్య ఉపశమనం కలుగుతుంది.రోజూ పరగడుపునే నానబెట్టిన బాదంపప్పు తింటే ముఖం మెరుపు సంతరించుకుంటుంది.

గుండె ఆరోగ్యానికి..
రోజు పరగడుపున నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల, చెడు కొలెస్ట్రాల్ కరిగించి,గుండె కణజాలం దృఢంగా తయారయ్యేందుకు దోహదపడతాయి.మరియు రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరిగేందుకు సహాయపడి, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి..
రోజూ బాదాంను నానబెట్టి తీసుకోవడంతో,ఇందులోని అధిక ఫైబర్,ప్రొటీన్,విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ న్యూట్రియన్స్ వల్ల రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ పెరగకుండా దోహదపడి,రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచుతాయి.ఈ బాదం రోజు నానబెట్టి తీసుకోవడం వల్ల షుగర్ లేనివారు భవిష్యత్తులో షుగర్ రాకుండా,శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అధిక బరువు తగ్గడానికి..
జీవన శైలి కారణంగా చాలామందిఅధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు.ఇలాంటివారు రోజు పరగడుపున నా పెట్టిన బాదం తీసుకోవడం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ని కరిగించి,అధిక బరువును తగ్గిస్తుంది.కావున ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే బాదాంను రోజు పరగడుపున తీసుకోవడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతాము.



RRR Telugu Movie Review Rating

రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>