PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/usaabfb638d-3e75-4285-9eff-122f658b56ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/usaabfb638d-3e75-4285-9eff-122f658b56ea-415x250-IndiaHerald.jpgశాస్త్ర పరిజ్ఞానం మెరుగయ్యాక ఎన్నో సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పెరిగిన శాస్త్ర పరిజ్ఞానంతో గుండెను తీసి గుండెను పెడుతున్నారు. తాజాగా ప్రాణం పోయినా వారిని కూడా బ్రతికిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా శాస్త్రాన్ని ఆయుధంగా చేసుకొని మనిషి దేవుడికి ఎదురు వెళుతున్నానని అనుకుంటున్నాడు. కానీ ఇలా అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకున్నా తాను మాత్రం తన చుట్టూ ఉండే పంచ భూతాల ఆధీనంలోనే ఇప్పటికీ బ్రతుకుతున్నాడు. ఎండ గానీ, చలి గానీ ఎన్ని డిగ్రీలలో, ఎంత ఉష్ణోగ్రతతో రాబోతుUSA{#}prakruti;Jaan;Europe countries;Newyork;Varsham;Manam;John;INTERNATIONALప్రకృతి బీభత్సం ముందు అమెరికా అయినా ఔటే?ప్రకృతి బీభత్సం ముందు అమెరికా అయినా ఔటే?USA{#}prakruti;Jaan;Europe countries;Newyork;Varsham;Manam;John;INTERNATIONALSat, 22 Jul 2023 10:19:00 GMTశాస్త్ర పరిజ్ఞానం మెరుగయ్యాక ఎన్నో సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పెరిగిన శాస్త్ర పరిజ్ఞానంతో గుండెను తీసి గుండెను పెడుతున్నారు. తాజాగా ప్రాణం పోయినా వారిని కూడా బ్రతికిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా శాస్త్రాన్ని ఆయుధంగా చేసుకొని మనిషి దేవుడికి ఎదురు వెళుతున్నానని అనుకుంటున్నాడు.


కానీ ఇలా అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకున్నా తాను మాత్రం తన చుట్టూ ఉండే పంచ భూతాల ఆధీనంలోనే ఇప్పటికీ బ్రతుకుతున్నాడు. ఎండ గానీ, చలి గానీ ఎన్ని డిగ్రీలలో, ఎంత ఉష్ణోగ్రతతో రాబోతున్నాయో చెప్పగలుగుతున్నాం. కానీ వాటిని అనుభవించడమే తప్ప పూర్తిగా ఆపలేక పోతున్నాం. తుఫాను ఎప్పుడు వస్తుందో, ఎంత తీవ్రతతో వస్తుందో చెప్పగలుగుతున్నాం. అలాగే భూకంపాలను, వరదలను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాం.


కానీ ఆ ప్రకృతి విలయాలను కట్టడి చేయలేక పోతున్నాం. ప్రకృతి కి చిన్న దేశాలు, అమెరికా, యూరప్ లాంటి అగ్ర దేశాలు అని తేడా ఉండదు. వర్షాలకు అక్కడ రోడ్లు కూడా నిండి పోవడం, కార్లు కొట్టుకుపోవడం  మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా అక్కడ పిడుగులతో కూడిన వర్షం కారణంగా దాదాపు 2,600 విమాన సర్వీసులు రద్దు అయ్యాయని సమాచారం. అలాగే 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలుస్తుంది.


ప్రత్యేకించి ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఉందని తెలుస్తుంది. దేశంలోని 1320 విమాన సర్వీసులు రద్దు అయితే, వాటిలో 350 న్యూ జెర్సీలోని న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉండిపోయాయి. జాన్ ఎఫ్ కెనడి ఎయిర్పోర్ట్, లా గార్డెన్ ఎయిర్పోర్ట్ లలో పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి అని సమాచారం. జె ఎఫ్ కే విమానాశ్రయంలో 318 విమాన సర్వీస్ లు రద్దు అయితే, 426 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని సమాచారం. ఇక లా గార్డెన్ విమానాశ్రయంలో 270 సర్వీసులు రద్దయితే, 290 విమాన సర్వీసులు లేటుగా నడుస్తున్నాయని సమాచారం.



RRR Telugu Movie Review Rating

యూట్యూబ్ ద్వారా భారీగా వెనకేసుకుంటున్న వరుణ్ సందేశ్ భార్య.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>