Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny1c745648-d8b6-4290-9904-ed6eff6f036a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny1c745648-d8b6-4290-9904-ed6eff6f036a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే స్టార్ హీరోలు అందరూ కూడా అన్నదమ్ముల్లా మెలుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకో అటు ఆయా హీరోల అభిమానులు మాత్రం ఎప్పుడూ బాక్స్ ఆఫీస్ వద్ద పోట్లాడుకుంటూ ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఏకంగా సోషల్ మీడియా వార్ కు దిగుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇలా సోషల్ మీడియా వేదికగా మొదలైన వార్ ఏకంగా బాహా బాహికి దిగెంత కూడా వెళ్తూ ఉంటుంది. తామందరం ఒకటే.. ఫ్యాన్స్ ఇలా మా హీరో గొప్పBunny{#}Allu Arjun;war;Box office;media;India;Ishtam;News;Success;Chiranjeevi;Hero;Cinemaబన్నీ చెప్పిన మాటతో అయినా.. ఫ్యాన్స్ మారుతారా?బన్నీ చెప్పిన మాటతో అయినా.. ఫ్యాన్స్ మారుతారా?Bunny{#}Allu Arjun;war;Box office;media;India;Ishtam;News;Success;Chiranjeevi;Hero;CinemaFri, 21 Jul 2023 09:30:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే స్టార్ హీరోలు అందరూ కూడా అన్నదమ్ముల్లా మెలుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకో అటు ఆయా హీరోల అభిమానులు మాత్రం ఎప్పుడూ బాక్స్ ఆఫీస్ వద్ద పోట్లాడుకుంటూ ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఏకంగా సోషల్ మీడియా వార్ కు దిగుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇలా సోషల్ మీడియా వేదికగా మొదలైన వార్ ఏకంగా బాహా బాహికి దిగెంత కూడా వెళ్తూ ఉంటుంది.


 తామందరం ఒకటే.. ఫ్యాన్స్ ఇలా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్టుకోవడం సరికాదు అని ఆయా స్టార్ హీరోలు ఎన్నిసార్లు చెప్పినా ఫ్యాన్స్ తీరులో మాత్రం మార్పు రాదు. అయితే గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీలో అల్లు, మెగా అభిమానుల మధ్య ఇలాంటి వార్ కొనసాగుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టిన తర్వాత అల్లు అర్జున్ తనకు కెరియర్ ను ప్రసాదించి.. ప్రోత్సాహించిన మెగాస్టార్ చిరంజీవిని పక్కన పెట్టేసాడు. కాస్తయినా గౌరవం ఇవ్వడం లేదు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది అంటూ ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.


 ఈ వార్తలపై అటు చిరంజీవి నుంచి ఫ్యామిలీ నుంచి కానీ.. ఇటు అల్లు అర్జున్ కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. దీంతో ఎవరికి వారు ఇష్టం వచ్చింది రాసుకున్నారు. ఇక ఫాన్స్ మధ్య కూడా గొడవ మొదలైంది. కానీ ఇప్పుడూ గొడవ పడేది కేవలం ఫ్యాన్స్ మాత్రమే.. హీరోలు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు అన్నదానికి నిరూపణగా మరోసారి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల బేబీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఏకంగా బేబీ సినిమా గురించి మాట్లాడుతూనే.. మెగాస్టార్ గారికి నేను పెద్ద ఫ్యాన్.. కట్ట కాలే వరకు ఆయన అభిమానినే అంటూ చెప్పాడు. అంతేకాదు మెగాస్టార్ తో ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పాడు. దీంతో అల్లు అర్జున్ , మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విభాగాలు లేవు అన్న విషయం పై క్లారిటీ వచ్చింది. అయితే కొట్టుకునేది ఫ్యాన్స్ మాత్రమే హీరోలు కాదు వాళ్ళు ఎప్పుడు బాగుంటారు అన్న విషయం కూడా మరోసారి నిరూపితమైంది.



RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>