PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-plan-for-dual-pensions-takes-shape12539a40-827d-4d0c-a1d3-197b981cc6f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-plan-for-dual-pensions-takes-shape12539a40-827d-4d0c-a1d3-197b981cc6f6-415x250-IndiaHerald.jpg పార్లమెంటులో యూసీసీ బిల్లుకు మద్దతివ్వక జగన్ కు వేరేదారిలేదు. అయితే జగన్ కున్న వెసులు బాటు ఏమిటంటే చంద్రబాబునాయుడు కూడా బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు బీజేపీ అడగకపోయినా ప్రతిబిల్లుకు చంద్రబాబు పార్లమెంటులో మద్దతిస్తునే ఉన్నారు. కాబట్టి జగన్ బిల్లుకు మద్దతిస్తే ముస్లింలు వ్యతిరేకమైపోతారనే భయంలేదు. అందుకనే తన సమస్యలను ముస్లిం పెద్దలు, మతపెద్దలతో మాట్లాడి వాళ్ళ సలహాలను కూడా తీసుకుంటున్నది. రేపొద్దున తనకు ఎలాంటి సమస్య రాకుండా జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్ధమవుJagan UCC Modi{#}YCP;CBN;Jagan;Narendra Modi;wednesday;Bharatiya Janata Partyఅమరావతి : జగన్ తెలివైన ఎత్తుగడఅమరావతి : జగన్ తెలివైన ఎత్తుగడJagan UCC Modi{#}YCP;CBN;Jagan;Narendra Modi;wednesday;Bharatiya Janata PartyFri, 21 Jul 2023 09:00:00 GMT


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో అందరి దృష్టి ఒక విషయం మీదే కేంద్రకృమయ్యుంది. అదేమిటంటే ఉమ్మడి పౌర స్మృతి (యీసీసీ) బిల్లు మీద. ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెట్టి నెగ్గించుకోవాలన్నది నరేంద్రమోడీ పట్టుదల. లోక్ సభలో చాలా ఈజీగా బిల్లు పాసైపోతుందనటంలో సందేహంలేదు. సమస్యంతా రాజ్యసభలోనే వస్తోంది. రాజ్యసభలో ఎన్డీయేకి సరిపడా మెజారిటిలేదు. అందుకనే ఇతరులపైన ఆధారపడక తప్పటంలేదు. ఆ ఇతరులంటే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి.




వీళ్ళిద్దరి మద్దతుతోనే మోడీ బిల్లులను రాజ్యసభలో నెగ్గించుకుంటున్నారు. ఆ ధైర్యంతోనే ఇపుడు కూడా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. యూసీసీ బిల్లంటేనే ముస్లింలకు వ్యతిరేకంగా తయారైందనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. ఈ బిల్లుపై ముస్లింల్లో మిశ్రమ స్పందనుంది. ముస్లింల అభిప్రాయాలు ఎలాగున్నాయన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే జగన్ ఏమి చేయబోతున్నారు అన్నది కీలకమైపోయింది. ఎందుకంటే వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి ముస్లిం మైనారిటీల్లో మెజారిటి సెక్షన్లు జగన్ కే మద్దతుగా నిలుస్తున్నారు.




అందుకనే ముస్లింలతో పేచీ లేకుండా జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. బుధవారం కొందరు ముస్లిం పెద్దలు, మతపెద్దలతో భేటీ అయ్యారు. యూసీసీ మీద ఎలా నడుకుంటే బావుంటుందో ఆలోచించి సలహా ఇవ్వమని అడిగారు. తాను అధికారంలో ఉన్నంతవరకు ముస్లిం సమాజానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ’రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ప్లేసులో మీరే ఉంటే ఏమి చేస్తారో ఆలోచించుకుని చెప్పండి’ అని జగన్ వాళ్ళతో అన్నారు.



పార్లమెంటులో యూసీసీ బిల్లుకు మద్దతివ్వక జగన్ కు వేరేదారిలేదు. అయితే జగన్ కున్న వెసులు బాటు ఏమిటంటే చంద్రబాబునాయుడు కూడా బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు బీజేపీ అడగకపోయినా ప్రతిబిల్లుకు చంద్రబాబు పార్లమెంటులో మద్దతిస్తునే ఉన్నారు. కాబట్టి జగన్ బిల్లుకు మద్దతిస్తే ముస్లింలు వ్యతిరేకమైపోతారనే భయంలేదు. అందుకనే తన సమస్యలను ముస్లిం పెద్దలు, మతపెద్దలతో మాట్లాడి వాళ్ళ సలహాలను కూడా తీసుకుంటున్నది. రేపొద్దున తనకు ఎలాంటి సమస్య రాకుండా జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్ధమవుతోంది. మొత్తానికి యూసీసీ బిల్లుపై జగన్ ప్లాన్డ్ గా వెళుతున్నట్లే ఉన్నారు.




RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>