Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0087a160-379d-49e0-95a0-fdc61f4af7e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0087a160-379d-49e0-95a0-fdc61f4af7e1-415x250-IndiaHerald.jpgమిల్కీబ్యూటీ తమన్న తాజాగా మరోసారి 'అజిత్‌'తో రొమాన్స్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం సామాజకమాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరం' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అజిత్‌ నటించిన 'తుణివు' తెలుగులో తెగింపు చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన విజయ్‌ చిత్రం వారిసు తరువాత ఆయన నటిస్తున్న 'లియో' చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. అలాంటిది అజిత్‌ తాజా చిత్రం మాత్రం ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు. దీనికి 'విడాముయిర్చి' అనే టైటిల్‌ను ఖరారు socialstars lifestyle{#}nayantara;Trisha Krishnan;tamannaah bhatia;Darsakudu;Director;Chitram;Cinemaమరోసారి అజిత్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ...!!మరోసారి అజిత్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ...!!socialstars lifestyle{#}nayantara;Trisha Krishnan;tamannaah bhatia;Darsakudu;Director;Chitram;CinemaFri, 21 Jul 2023 19:10:00 GMTమిల్కీబ్యూటీ తమన్న తాజాగా మరోసారి 'అజిత్‌'తో రొమాన్స్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం సామాజకమాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరం' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అజిత్‌ నటించిన 'తుణివు' తెలుగులో తెగింపు చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన విజయ్‌ చిత్రం వారిసు తరువాత ఆయన నటిస్తున్న 'లియో' చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది.

అలాంటిది అజిత్‌ తాజా చిత్రం మాత్రం ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు. దీనికి 'విడాముయిర్చి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త 'విఘ్నేశ్‌ శివన్‌' దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఈ చిత్రం నుంచి ఆయనను తొలగించి దర్శకుడు మగిళ్‌ తిరుమేణిని ఎంపిక చేశారు. దీంతో చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా ఆగస్ట్‌లో విడాముయిర్చి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం అనే టాక్‌ వినిసిస్తోంది. కాగా ఇందులో నటి త్రిష నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే చిత్ర షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడుతుండటంతో ప్రస్తుతం విజయ్‌కు జంటగా లియో చిత్రాన్ని పూర్తి చేసిన త్రిషకు తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె మలయాళంలో నటుడు 'టోవినో థామస్‌'కు జంటగా ఐడెంటీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో అజిత్‌ సరనస నటించే అవకాశం లేదనే టాక్‌ వినిపిస్తోంది. ఇకపోతే నటి తమన్న ప్రస్తుతం రజనీకాంత్‌ సరసన 'జైలర్‌' చిత్రంలో నటించి పూర్తి చేశారు.కాగా ఇందులోని 'కావాలయా అనే పాట'ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు.

ఆ పాటలో తమన్న కవ్వింపు డాన్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అంతే కాదు ఈ పాట ఈ మిల్కీబ్యూటీకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనేది తాజా సమాచారం. అందులో ఒకటి అజిత్‌ సరసన నటించే విడాముయిర్చి అని టాక్‌. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

బ్లాక్ శారీలో నోరఫతేహి అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>