Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/trainf62324e6-9c9b-48d1-af2b-ed6bfa8d220b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/trainf62324e6-9c9b-48d1-af2b-ed6bfa8d220b-415x250-IndiaHerald.jpgప్రపంచంలో మూడో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశంగా కొనసాగుతున్న భారత్ లో రైల్వే ప్రయాణం అనేది ఎంతో మంది జీవితంలో రోజువారి దినచర్యగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు ఈ రైలు మార్గాల ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అతి తక్కువ ఖర్చుతోనే దూర ప్రయాణాలు చేసే సౌలభ్యం ఉండడంతో ఎక్కువమంది.. ఇక రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు భారత రైల్వే శాఖ కొత్త కొత్త ఆవిష్కరణలకు తెర లేపుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో వేగంగTrain{#}Athadu;Madhya Pradesh - Bhopal;Press;Indiaమూత్రం పోసేందుకు వందే భారత్ ఎక్కాడు.. కానీ చివరికి?మూత్రం పోసేందుకు వందే భారత్ ఎక్కాడు.. కానీ చివరికి?Train{#}Athadu;Madhya Pradesh - Bhopal;Press;IndiaFri, 21 Jul 2023 07:21:00 GMTప్రపంచంలో మూడో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశంగా కొనసాగుతున్న భారత్ లో రైల్వే ప్రయాణం అనేది ఎంతో మంది జీవితంలో రోజువారి దినచర్యగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు ఈ రైలు మార్గాల ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అతి తక్కువ ఖర్చుతోనే దూర ప్రయాణాలు చేసే సౌలభ్యం ఉండడంతో ఎక్కువమంది.. ఇక రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు భారత రైల్వే శాఖ కొత్త కొత్త ఆవిష్కరణలకు తెర లేపుతుంది.



 ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇక వినూత్నమైన రీతిలో మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది భారత రైల్వే శాఖ. ఈ క్రమంలోనే వందే భారత్ రైళ్లు ప్రస్తుతం పట్టాలపై రయ్ రయ్ అంటూ బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు అధునాతన టెక్నాలజీతో కూడిన ఈ వందే భారత రైళ్ల కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.



 ఇటీవలే మధ్యప్రదేశ్ లోని భూపాల్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన అబ్దుల్ అనే వ్యక్తికి ఊహించడం రీతిలో చేదు అనుభవం ఎదురైంది. అతడు టాయిలెట్ నుంచి బయటికి వచ్చేసరికి.. వందే భారత్ డోర్లు మూసుకుపోయాయి. రైలు కూడా ముందుకు కదిలింది. అయితే సాయం చేయాలంటూ అతడు టీసీని దీనంగా సంప్రదించాడు. అయితే టికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు టీసీలు ఏకంగా ఒక వెయ్యి 20 రూపాయలు అతనికి ఫైన్ వేశారు. తర్వాత స్టేషన్లో దిగి మరో 750 రూపాయలు వెచ్చించి.. బస్సులో భూపాల్ చేరుకున్నాడు సదరు వ్యక్తి. అదే సమయంలో అతను బుక్ చేసిన 4000 రూపాయల విలువైన రైలు టికెట్లు కూడా వృధా అయిపోయాయి అని చెప్పాలి. ఇలా అతను మూత్రం పోసినందుకు 6000 పోగొట్టుకున్నాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మహావీరుడు మూవీకి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>