PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-have-pawan-achieved-during-delhi-tour67c24020-36e9-4bb3-9d8a-41a8b67fff7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-have-pawan-achieved-during-delhi-tour67c24020-36e9-4bb3-9d8a-41a8b67fff7f-415x250-IndiaHerald.jpg అందుకనే అమిత్ షా తో భేటీ అవటాన్నే పవన్ పెద్ద అచీవ్మెంట్ గా ఫీలవుతున్నట్లున్నారు. పైగా అమిత్ తో భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించినట్లు ట్వీట్ చేశారు. అమిత్ తో పవన్ వర్తమాన రాజకీయాలపై ఏమి చర్చించి ఉంటారు ? టీడీపీతో పొత్తుగురించి, జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడటం వీలైతే ఫిర్యాదులు చేయటమే కదా పవన్ చేసేది. పవన్ చేసే ఆరోపణలు, ఫిర్యాదులు అమిత్ షా కు తెలీకుండానే ఉంటాయా ?Janasena Pawan Amithshah{#}Pawan Kalyan;Delhi;Amith Shah;Vishakapatnam;Jagan;Narendra Modi;Andhra Pradesh;Amit Shahఢిల్లీ : ఉత్త సోది తప్ప ఇంకేమైనా ఉందా ?ఢిల్లీ : ఉత్త సోది తప్ప ఇంకేమైనా ఉందా ?Janasena Pawan Amithshah{#}Pawan Kalyan;Delhi;Amith Shah;Vishakapatnam;Jagan;Narendra Modi;Andhra Pradesh;Amit ShahFri, 21 Jul 2023 03:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడురోజుల ఢిల్లీ టూరులో సాధించింది ఏమన్నా ఉందా ? ఉంది అంటే అది అమిత్ షా తో భేటీ అవటం మాత్రమే. ఎందుకంటే పవన్ ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా నరేంద్రమోడీ, అమిత్ షా మాత్రం అపాయిట్మంటె ఇవ్వటంలేదు. పవన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మూడు, నాలుగు రోజులు వెయిట్ చేయటం ఎవరో ఇన్చార్జిలను కలిసి మాట్లాడేసి తిరిగొచ్చేస్తున్నారంతే.




అందుకనే అమిత్ షా తో భేటీ అవటాన్నే పవన్ పెద్ద అచీవ్మెంట్ గా ఫీలవుతున్నట్లున్నారు. పైగా అమిత్ తో భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించినట్లు ట్వీట్ చేశారు. అమిత్ తో పవన్ వర్తమాన రాజకీయాలపై ఏమి చర్చించి ఉంటారు ? టీడీపీతో పొత్తుగురించి, జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడటం వీలైతే ఫిర్యాదులు చేయటమే కదా పవన్ చేసేది. పవన్ చేసే ఆరోపణలు, ఫిర్యాదులు అమిత్ షా కు తెలీకుండానే ఉంటాయా ?




అలాగే రాష్ట్రాభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించినట్లు కూడా చెప్పారు. రాష్ట్రాభివృద్ధిపై ఏమి చర్చిస్తారు ? ఏమి ప్రణాళికలు వేస్తారు ? ఏపీ అభివృద్ధికి పవన్ కు ఏమిటి సంబంధం ? అభివృద్ధి లేదా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించాల్సింది జగన్మోహన్ రెడ్డి. పవన్ ఎంత చర్చించినా ఎలాంటి ఉపయోగముండదు. నిజంగానే అమిత్, పవన్ కు రాష్ట్రాభివృద్ధిపై అంతటి చిత్తశుద్దే ఉంటే విభజన చట్టంలో హామీలిచ్చిన ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశాలను నరేంద్రమోడీ ఎందుకు తుంగలో తొక్కేస్తారు ?




హామీలను అమలుచేయాల్సిన నరేంద్రమోడీ, అమిత్ షా ను వదిలిపెట్టి పవన్ 24 గంటలూ, 365 రోజులూ జగన్ పైన ఎందుకు ఆరోపణలతో బురదచల్లేస్తున్నట్లు ? పైగా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాల నాశననానికి కారణమైన చంద్రబాబునాయుడును కూడా పవన్ పల్లెత్తు మాటకూడా అనటంలేదు. వీళ్ళందరు కలిసి రాష్ట్రాభివృద్ధిపైన ప్రణాళికలపైన చర్చించామని సోది చెబితే జనాలు నమ్ముతారా ?




RRR Telugu Movie Review Rating

మహావీరుడు మూవీకి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>