LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health4b3220d7-7c84-435b-b2b8-6d4bfb728f53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health4b3220d7-7c84-435b-b2b8-6d4bfb728f53-415x250-IndiaHerald.jpgతవుడును పశువులకు ఆహారంగా ఇవ్వడంతో పాటు దీనిని మనం కూడా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్స్ తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 6నెలల పాటు 344 మందిపై ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ప్రతి రోజూ 2 నుండి 3 టీ స్పూన్ల తవుడు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజూ తవుడునుHEALTH{#}Iran;Cholesterol;Cancer;Vitamin;Iron;Manamతవుడుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు?తవుడుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు?HEALTH{#}Iran;Cholesterol;Cancer;Vitamin;Iron;ManamThu, 20 Jul 2023 14:21:27 GMTతవుడును పశువులకు ఆహారంగా ఇవ్వడంతో పాటు దీనిని మనం కూడా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్స్ తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 6నెలల పాటు 344 మందిపై ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ప్రతి రోజూ 2 నుండి 3 టీ స్పూన్ల తవుడు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజూ తవుడును తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు 40 శాతం దాకా పెరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. అందువల్ల మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా మనం పడకుండా ఉంటాము. ఇంకా అలాగే తవుడును తీసుకోవడం వల్ల శరీరంలో 40 శాతం దాకా ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది.ఈ తవుడులో గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్ ప్లామేషన్ ను పెంచే ఎంజైమ్ లను నశింపజేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.


అందువల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గడంతో పాటు రాకుండా ఉంటుంది. ఇంకా అలాగే తవుడులో ఉండే ఫైబర్ మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది.ఈ తవుడును తీసుకోవడం వల్ల విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా శరీరానికి ఎక్కువగా లభిస్తాయి. ఇంకా అలాగే 100 గ్రాముల తవుడులో 45 మిల్లీ గ్రాముల ఐరన్ అనేది ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. ఇంకా అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా తవుడు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇక ధాన్యాల్లో పోషకాలన్నీ కూడా వాటి పైపొరల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పొరల్లో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఈ ధాన్యాన్ని పాలిష్ పట్టడం వల్ల ఈ పోషకాలన్నీ కూడా తవుడులో వచ్చి చేరతాయి. కాబట్టి తవుడును తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మనం వీలైనంత వరకు ధాన్యాన్ని మొదట పాలిష్ పట్టగా వచ్చిన ఆ తవుడును సేకరించి తీసుకోవాలి.దీనిని ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న తవుడును రోజూ 2 నుండి 3 టీ స్పూన్ల మోతాదులో నేరుగా తినవచ్చు లేదా చపాతీపిండిలో కలుపుకుని చపాతీలాగా చేసుకుని తినవచ్చు. ఇంకా అలాగే మినుములతో కలిపి వేయించి సున్నుండలుగా చేసుకుని తినవచ్చు. ఇంకా అలాగే తవుడును నీటిలో కలిపి తాగవచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో తవుడును తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతంచేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>