Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/voted5e75a1cb-2239-46d5-bfd1-6ce15e21e3bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/voted5e75a1cb-2239-46d5-bfd1-6ce15e21e3bf-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి అని అడిగితే.. నాలుగు లేదా ఐదు ఓట్లు ఉంటాయని చెబుతారు ఎవరైనా. అయితే ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే 10 లేదా 15 ఓట్లు ఉంటాయి. కానీ ఒకే ఇంట్లో ఏకంగVoted{#}Amaravati;Kurnool;Traffic police;Manam;media;Andhra Pradeshఓరి నాయనో.. ఒకే ఇంట్లో 706 ఓట్లు ఉన్నాయట?ఓరి నాయనో.. ఒకే ఇంట్లో 706 ఓట్లు ఉన్నాయట?Voted{#}Amaravati;Kurnool;Traffic police;Manam;media;Andhra PradeshThu, 20 Jul 2023 11:00:00 GMTసోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి అని అడిగితే.. నాలుగు లేదా ఐదు ఓట్లు ఉంటాయని చెబుతారు ఎవరైనా. అయితే ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే 10 లేదా 15 ఓట్లు ఉంటాయి. కానీ ఒకే ఇంట్లో ఏకంగా 706 ఓట్లు ఉన్నాయి అంటే నమ్ముతారా.


 ఊరుకోండి గురు.. ఒక ఇంట్లో 706 ఓటర్లు ఉండడమేంటి వినడానికి విడ్డూరంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. కానీ ఇక్కడ ఒక ఇంట్లో 706 మంది ఓటర్లు ఉన్నారు. అంతేకాదు ఇక మరో ఇంట్లో 644 మంది ఓటర్లు ఉన్నారు అన్న విషయం ఇటీవల తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో వెలుగులోకి వచ్చింది. కాగా అధికారులు తప్పులు తడకల ఓటర్ల జాబితా రూపొందించి చేతులు దులుపుకున్నారు అని విమర్శలు వస్తున్నాయి.


 కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 17వ వార్డులోకి న్యూ గాంధీనగర్, అమరావతి నగర్, కల్లుబావి తదితర ప్రాంతాలు 223వ పోలీస్ కేంద్రం పరిధిలోకి వస్తాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంటి నెంబర్ 17 లో 644 ఓట్లు ఉన్నాయి. ఇంటి నెంబర్ 17/836 లో 706 ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఒకే ఇంట్లో వందల ఓట్లు ఎలా ఉన్నాయి అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. ఈ విషయంపై విచారణ చేపట్టి ఏం జరిగింది అనే విషయాన్ని తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఒక ఇంట్లో వందల ఓట్లు తెరమీదికి రావడం మాత్రం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది .



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>