PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabadf3b360bd-eb23-4d35-876a-b4550a66e846-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabadf3b360bd-eb23-4d35-876a-b4550a66e846-415x250-IndiaHerald.jpgఅన్ని కాలాల కంటే వర్షా కాలం చాలా ప్రమాదకరమైనది. ఈ కాలంలో అనేక జబ్బులు రావడమే కాదు ఆ వర్షానికి బయట రోడ్లు కూడా మునిగిపోతుంటాయి. ఇక పెద్ద పెద్ద సిటీల్లో అయితే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక తెలంగాణలో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ వర్షాల్లో బయటకు వస్తున్న వారంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పోనీ క్యాబ్‌లను ఆశ్రయిద్దామనుకుంటే వాటి ధరలు కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని గుర్తు చేHYDERABAD{#}Telangana;Two-wheeler drivers;Andhra Pradesh;Driver;Hyderabadహైదరాబాద్: ఆకాశాన్ని తాకుతున్న క్యాబ్ ధరలు?హైదరాబాద్: ఆకాశాన్ని తాకుతున్న క్యాబ్ ధరలు?HYDERABAD{#}Telangana;Two-wheeler drivers;Andhra Pradesh;Driver;HyderabadThu, 20 Jul 2023 21:28:50 GMTహైదరాబాద్: ఆకాశాన్ని తాకుతున్న క్యాబ్ ధరలు?

అన్ని కాలాల కంటే వర్షా కాలం చాలా ప్రమాదకరమైనది. ఈ కాలంలో అనేక జబ్బులు రావడమే కాదు ఆ వర్షానికి బయట రోడ్లు కూడా మునిగిపోతుంటాయి. ఇక పెద్ద పెద్ద సిటీల్లో అయితే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక తెలంగాణలో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ వర్షాల్లో బయటకు వస్తున్న వారంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పోనీ క్యాబ్‌లను ఆశ్రయిద్దామనుకుంటే వాటి ధరలు కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని గుర్తు చేస్తాయి. ఇక ట్రాఫిక్ సంగతి కూడా అంతే. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల అవస్థలు మాములుగా ఉండవు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయిస్తే ఇక వాటి ధరలు చూసి జనం బాగా షాకవుతున్నారు. సాధారణ రోజుల్లో ఉండే క్యాబ్ ధరలతో పోలిస్తే వాటికి రెండింతలు, మూడింతలు ధరలు వసూలు చేస్తున్నారు డ్రైవర్లు.


బేగంపేట నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 వరకు ఉంటుంది. అయితే ఈ వర్షాల కారణంగా దానికి డబుల్ రేట్లనేవి పలుకుతున్నాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్‌లలో వెళ్లాలంటే సామాన్యుడికి అందని ధరలు పలుకుతూ ఎంతగానో భయపెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఆగకుండా వర్షాలు కుండపోతగా పడుతున్నాయి.ఇంకా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.అలాగే మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈ వర్షాల నుంచి జనాలు విముక్తి ఎప్పుడు పొందుతారో చూడాలి.ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ వర్షాల వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ధమాకా మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>