MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiger-nageshwar-raob4bfe174-62bc-4d18-9df6-8c9cc2792f03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiger-nageshwar-raob4bfe174-62bc-4d18-9df6-8c9cc2792f03-415x250-IndiaHerald.jpgతాజాగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పైకి కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయకూడదు అంటూ ఏపీ హైకోర్టులో ఆపిల్ దాఖలవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ సినిమా కదా ఎరుకుల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉంది అంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేశారు. Tiger Nageshwar Rao{#}Ravi;abhishek;ravi teja;Apple;Andhra Pradesh;Tollywood;Cinema;media;Tamil;village;Kannada;Akkineni Nageswara Raoరవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై హైకోర్టులో కేసు నమోదు..!?రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై హైకోర్టులో కేసు నమోదు..!?Tiger Nageshwar Rao{#}Ravi;abhishek;ravi teja;Apple;Andhra Pradesh;Tollywood;Cinema;media;Tamil;village;Kannada;Akkineni Nageswara RaoThu, 20 Jul 2023 16:27:40 GMTతాజాగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పైకి కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయకూడదు అంటూ ఏపీ హైకోర్టులో ఆపిల్ దాఖలవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ సినిమా కదా ఎరుకుల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉంది అంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేశారు. 

స్టువర్టు పురానికి చెందిన బాలరాజ్ అనే ఒక వ్యక్తి ఈ సినిమాపై థియేటర్లలో విడుదల చేయకూడదు అంటూ ఈ సినిమా పై కేసు వేయడం జరిగింది. మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమాని తీసి విడుదల చేయాలని చూస్తున్నారు అంటూ ఈ సినిమా విడుదల దయచేసి ఆపేయాలి అంటూ ఆయన పేర్కొన్నాడు. పాతతరం నేరస్తుల జీవన ఆధారాన్ని భూతద్దంలో చూపిస్తూ మా గ్రామాన్ని క్రైమ్ క్యాపిటల్గా చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా చదువుకొని హుందాగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 
ఇలాంటి పరిస్థితుల్లో టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలో విడుదలయితే మా గ్రామం పై ప్రభావం చూపుతుంది.. అని దయచేసి మా ఊరిని గజదొంగల ఊరుగా చూపించకండి, ఈ పని మానేయండి అంటూ పేర్కొన్నాడు.

వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్న ఒకరిద్దరు మినహాయించి తమ గ్రామంలో ఆనాటి తరం గజదొంగలు ఎవరూ లేరు అంటూ ఈ కేసులో భాగంగా ఆయన పేర్కొన్నాడు. ఇక హైకోర్టులో ఆపిల్ను రెండు వారాలపాటు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావు సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ విడుదలై మంచి రెస్పాన్స్ ను కనిపరిచాయి. కాగా ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ హిందీ కన్నడ భాషల్లో సైతం విడుదల కాబోతోంది.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్లు.. లీకైన ఫోటోలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>