Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/harbajanfde60621-8287-472a-a564-10dd830218ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/harbajanfde60621-8287-472a-a564-10dd830218ab-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి కెప్టెన్సీ మార్పు పై తరచూ చర్చ జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. కెప్టెన్ గా ఒక ఆటగాడు విఫలం అయినప్పుడు మాత్రమే కెప్టెన్ గా అతని మార్చి మరొకరిని నియమిస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక ఇష్టరీతిన విమర్శలు చేస్తున్నవారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నప్పుడు.. అతని వల్ల ఐసీసీ టోర్నర్ గెలవడం సాధ్యం కాదని.. అతని కెప్టెన్సీ నుంచి తప్పించి ఐపీఎల్లో ఐదు టైటిల్స్ గెలిచHarbajan{#}VIRAT KOHLI;Harbhajan Singh;ICC T20;Rohit Sharma;March;Yuvaరోహిత్ కెప్టెన్సీ పై.. హర్భజన్ కీలక వ్యాఖ్యలు?రోహిత్ కెప్టెన్సీ పై.. హర్భజన్ కీలక వ్యాఖ్యలు?Harbajan{#}VIRAT KOHLI;Harbhajan Singh;ICC T20;Rohit Sharma;March;YuvaThu, 20 Jul 2023 09:00:00 GMTగత కొంతకాలం నుంచి కెప్టెన్సీ మార్పు పై తరచూ చర్చ జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. కెప్టెన్ గా ఒక ఆటగాడు విఫలం అయినప్పుడు మాత్రమే కెప్టెన్ గా అతని మార్చి మరొకరిని నియమిస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక ఇష్టరీతిన విమర్శలు చేస్తున్నవారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నప్పుడు.. అతని వల్ల ఐసీసీ టోర్నర్ గెలవడం సాధ్యం కాదని.. అతని కెప్టెన్సీ నుంచి తప్పించి ఐపీఎల్లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు ఎంతోమంది.


 అయితే ఆ తర్వాత కాలంలో అనూహ్యంగా విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లకు కెప్టెన్సీ కూడా తప్పుకున్నాడు అని చెప్పాలి. చివరికి అందరూ కావాలి అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ చేతికి సారధ్య బాధ్యతలు వచ్చాయి. అయితే రోహిత్ శర్మ జట్టును ఎంతో విజయపదంలోనే ముందుకు నడిపిస్తున్నాడు. కానీ గత ఏడాది టీ20 వరల్డ్ కప్.. ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసి ఫైనల్ లో జట్టును గెలిపించలేకపోయాడు. ఇక వ్యక్తిగత ప్రదర్శన కూడా పేలవంగానే ఉంది. రోహిత్ ను కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు తెరమీదకి వస్తూ ఉన్నాయి.


 కాగా ఇలా కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించాలి అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇదే విషయం గురించి భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు గొప్ప క్యారెక్టర్ ఉంది అంటూ చెప్పుకోచాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అందరిని గౌరవిస్తాడని హర్భజన్ అన్నాడు. ఇంతకుముందు వీరే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని చెప్పారు. ఇప్పుడు రోహిత్ ని విమర్శిస్తున్నారు. ఇదే వ్యక్తులు యువ ఆటగాళ్లు నిలదొక్కుకోవడానికి తగినంత టైం ఇవ్వాలి. వారిపై విశ్వాసం ఉంచాలి అని వీళ్లే చెబుతారు అంటూ హర్భజన్  వ్యాఖ్యానించాడు.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>