LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fridge-food-itemsaf24ff80-c20f-407b-a9c1-600b8321a9ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fridge-food-itemsaf24ff80-c20f-407b-a9c1-600b8321a9ed-415x250-IndiaHerald.jpgపూర్వ కాలంలో రిఫ్రిజిరేటర్లు లాంటివి అస్సలు ఉండేవి కాదు. వారు ఎక్కువగా ఆరుబయటే ఏ పదార్థాలనైనా ఉంచేవారు. కానీ ప్రస్తుత కాలంలో అన్ని మోడ్రన్ గా మారిపోతున్న నేపద్యంలో రిఫ్రిజిరేటర్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే రిఫ్రిజిరేటర్ ఉంది కదా అని ప్రతి వస్తువును కూడా అందులో పెట్టి తింటున్నారు ప్రజలు. కానీ వీటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే వేసవికాలం వచ్చిందంటే చాలు బయట మండే ఎండలు తట్టుకోలేక ఇంటికి వస్తేనే కాస్త ఫ్రిజ్లో పెట్టిన నీళ్లు తాగితే ప్రశాంతంగా అనFRIDGE; FOOD ITEMS{#}vegetable market;Manamలైఫ్ స్టైల్: వీటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టి అసలు తినకూడదట..!లైఫ్ స్టైల్: వీటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టి అసలు తినకూడదట..!FRIDGE; FOOD ITEMS{#}vegetable market;ManamThu, 20 Jul 2023 19:09:29 GMTపూర్వ కాలంలో రిఫ్రిజిరేటర్లు లాంటివి అస్సలు ఉండేవి కాదు. వారు ఎక్కువగా ఆరుబయటే ఏ పదార్థాలనైనా ఉంచేవారు. కానీ ప్రస్తుత కాలంలో అన్ని మోడ్రన్ గా మారిపోతున్న నేపద్యంలో రిఫ్రిజిరేటర్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే రిఫ్రిజిరేటర్ ఉంది కదా అని ప్రతి వస్తువును కూడా అందులో పెట్టి తింటున్నారు ప్రజలు. కానీ వీటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే వేసవికాలం వచ్చిందంటే చాలు బయట మండే ఎండలు తట్టుకోలేక ఇంటికి వస్తేనే కాస్త ఫ్రిజ్లో పెట్టిన నీళ్లు తాగితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతలా వేసవిలో చాలామందికి ఫ్రిడ్జ్ అత్యవసరంగా మారిపోయింది.

కానీ ఆహార పదార్థాలను, కూరగాయలను అలాగే నీళ్లు, పాలు, పెరుగు వంటివి చెడిపోకుండా ఉండడానికి కూడా ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. కానీ కొన్ని రకాల కూరగాయలు ఆహార పదార్థాలను మాత్రం ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకూడదట వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే అలా రిఫ్రిజిరేటర్ లో పెట్టకుండా ఉండాల్సిన వాటిలో పుచ్చకాయలు ఒకటి . వేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు పుచ్చకాయను ఫ్రిజ్లో పెడుతూ ఉంటాం. పుచ్చకాయలను అలాగే ఫ్రిజ్లో పెట్టకూడదట. ఒకవేళ వాటిని కట్ చేసినట్లయితే మూత కలిగిన బాక్సు లేదా గిన్నెలో పెట్టి ఆ తర్వాత తినాలని వైద్యులు చెబుతున్నారు.

అలాగే ఉల్లిపాయలను కూడా మనం వంటకి సరిపోయే దాని కంటే ఎక్కువ మొత్తంలో కోసి తర్వాత ఉపయోగించుకోవడానికి వాటిని మళ్ళీ ఫ్రిజ్లో పెడుతూ ఉంటాం.  దానివల్ల ఫ్రిడ్జ్ లో చెడు వాసనతో పాటు ఆ వాసన ఇతర పదార్థాలపై కూడా పడుతుందట . కాబట్టి జరిగిన ఉల్లిపాయలను కూడా ఎప్పుడు ఫ్రిజ్లో పెట్టకుండా ఉండడమే మంచిది. అలాగే బంగాళదుంపలను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. వీటి పైన ఫంగస్ వచ్చి అవి బ్యాక్టీరియా తో నిండిపోతాయని కాబట్టి సాధ్యమైనంత వరకు బంగాళదుంపలను బయట ఉంచి తినాలని చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్లు.. లీకైన ఫోటోలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>