PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-janasena-modi-bjp-tdpc893a878-0911-4d65-b4fc-7edf4057fef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-janasena-modi-bjp-tdpc893a878-0911-4d65-b4fc-7edf4057fef6-415x250-IndiaHerald.jpgమంగళవారం సమావేశం అయిపోయిన తర్వాత బుధవారం ఉదయం ఏపీ ఇన్చార్జి మురళీధరన్ తో భేటీ అయ్యారు. బహుశా పొత్తుగురించే మాట్లాడుంటారు. నిజానికి పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది నరేంద్రమోడీయే కానీ వీళ్ళెవరు కాదు. మోడీకేమో చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకోవటం ఏమాత్రం ఇష్టంలేదు. ఈ విషయం స్పష్టంగా అందరికీ తెలిసిపోతోంది పవన్ కు తప్ప. తాజాగా జరిగిన ఎన్డీయే సమావేశానికి కూడా టీడీపీని ఆహ్వానించలేదు. pawan janasena modi bjp tdp{#}wednesday;CBN;TDP;Janasena;Bharatiya Janata Party;Andhra Pradeshఅమరావతి : పవన్ కు విషయం ఇంకా అర్ధంకాలేదా ?అమరావతి : పవన్ కు విషయం ఇంకా అర్ధంకాలేదా ?pawan janasena modi bjp tdp{#}wednesday;CBN;TDP;Janasena;Bharatiya Janata Party;Andhra PradeshThu, 20 Jul 2023 03:00:00 GMT


వేలాది పుస్తకాలు చదివానంటారు.ఎందరో మహనీయుల, విప్లవకారుల జీవితచరిత్రలను చదివానంటారు. కానీ కళ్ళముందు జరుగుతన్నదాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఆయనే జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్డీయే సమావేశంలో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని ప్రకటించేశారు.  టీడీపీతో పొత్తు పెట్టుకునేట్లుగా బీజేపీ పెద్దలను కూడా ఒప్పిస్తానని మరోసారి ప్రకటించారు.





మంగళవారం సమావేశం అయిపోయిన తర్వాత బుధవారం ఉదయం ఏపీ ఇన్చార్జి మురళీధరన్ తో భేటీ అయ్యారు. బహుశా పొత్తుగురించే మాట్లాడుంటారు. నిజానికి పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది నరేంద్రమోడీయే కానీ వీళ్ళెవరు కాదు. మోడీకేమో చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకోవటం ఏమాత్రం ఇష్టంలేదు. ఈ విషయం స్పష్టంగా అందరికీ తెలిసిపోతోంది పవన్ కు తప్ప.  తాజాగా జరిగిన ఎన్డీయే సమావేశానికి కూడా టీడీపీని ఆహ్వానించలేదు.





రీసెంట్ డెవలప్మెంట్ ఏమిటంటే ఒకప్పటిలా చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తుకు అంత వెంపర్లాడటం లేదట. ఎందుకంటే బీజేపీ మీద జనాల్లో ఉన్న మంటంతా టీడీపీ మీదకూడా పడుతుందని తమ్ముళ్ళు పదేపదే పోరుతున్నారట. దాంతో చంద్రబాబులో కూడా పొత్తుపై పునరాలోచనలో ఉన్నారని సమాచారం. అంటే చంద్రబాబుతో పొత్తుపెట్టుకునేందుకు మోడీ ఇష్టపడటంలేదు. బీజేపీతో చేతులు కలిపేందుకు చంద్రబాబు కూడా పెద్దగా ఆసక్తిగా లేరు. మరీ విషయం పవన్ కు అర్ధంకావటంలేదా ?





చంద్రబాబు తరపున బీజేపీ పెద్దలతో ఎందుకని  పవన్ రాయబారం చేస్తున్నట్లు ? తాజా రాజకీయ పరిణామాలు అందరికీ అర్ధమవుతుంటే పవన్ మాత్రం ఎందుకని ఇంకా కళ్ళు మూసుకుని కూర్చున్నారో తెలీటంలేదు. జరుగుతున్న పరిణామాలను పవన్ గమనిస్తున్నారా ? లేకపోతె అర్ధంకానట్లు నటిస్తున్నారా ? ఒక విషయం అయితే ఖాయంగా చెప్పవచ్చు. అదేమిటంటే టీడీపీ లేకుండా బీజేపీతో కలిసి వెళ్ళటానికి పవన్ ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో  కలిసి ఎన్నికలకు వెళ్ళటానికి పవన్ రెడీగా ఉన్నారు. కాకపోతే బీజేపీని వదిలేసేందుకు ధైర్యం సరిపోతున్నట్లులేదు.




RRR Telugu Movie Review Rating

20 రోజుల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ వసూలు చేసిన "సామజవరగమన" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>