MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu96784269-f9e3-4766-abfd-44649a24ec9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu96784269-f9e3-4766-abfd-44649a24ec9d-415x250-IndiaHerald.jpgప్రెజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.అయితే ఎప్పటినుంచో తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం ఇంకా పాన్ ఇండియా మార్కెట్ ని ఓపెన్ చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు.కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు తన సినిమాలను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిచయం చేశారMAHESH BABU{#}Rajani kanth;Rajamouli;kalyan;trivikram srinivas;mahesh babu;srinivas;Hero;Box office;India;Raccha;NTR;Telugu;Guntur;Tollywood;Cinema;Newsఅందుకే సూపర్ స్టార్ టాలీవుడ్ నెం.1 హీరో అయ్యింది?అందుకే సూపర్ స్టార్ టాలీవుడ్ నెం.1 హీరో అయ్యింది?MAHESH BABU{#}Rajani kanth;Rajamouli;kalyan;trivikram srinivas;mahesh babu;srinivas;Hero;Box office;India;Raccha;NTR;Telugu;Guntur;Tollywood;Cinema;NewsThu, 20 Jul 2023 23:22:23 GMTప్రెజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.అయితే ఎప్పటినుంచో తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం ఇంకా పాన్ ఇండియా మార్కెట్ ని ఓపెన్ చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు.కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు తన సినిమాలను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిచయం చేశారు.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కానుంది. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్.కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి విడుదల అవ్వాలంటే ఖచ్చితంగా ఓ 5 సంవత్సరాలు పడుతుంది.ఇకపోతే  టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే రచ్చ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ పొజిషన్లో ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, ప్రభాస్, రాంచరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు ఈ నెంబర్ వన్ పొజిషన్ లోపోటీ పడుతూ ఉంటారు. 


అయితే కొన్ని లెక్కల ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలుస్తుంది. మహేష్ ప్లాప్ సినిమా ఒక చిన్న హీరోకి 2 హిట్లతో సమానం.ప్రస్తుత మన స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు.అయితే మహేష్ బాబు మాత్రం తన సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసినప్పటికీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అని తెలుస్తుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా కోసం ఏకంగా 78 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ సమాచారం తెలుస్తుంది. అయితే ఈయన సినిమా రెండు రాష్ట్రాలకు పరిమితమైనప్పటికీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే నిజంగా మహేష్ బాబు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారని తెలుస్తుంది.ఎందుకంటే ఒక హీరోకి వున్న బాక్స్ ఆఫీస్ స్టామినా, రికార్డులు, క్రేజ్ ని బట్టే ఆ హీరోలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ విషయంలో మహేష్ అందరి హీరోల కంటే టాప్ లో ఉంటాడు. మహేష్ తో సినిమా అంటే నిర్మాతలకి లాభాలు గ్యారెంటీ. ఒక వేళ లాభాలు రాకపోయిన పెట్టిన పెట్టుబడిని రాబట్టగలిగే స్టామినా మహేష్ కి ఉంది. అందుకే నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు.





RRR Telugu Movie Review Rating

ధమాకా మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>