MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan38e9a17d-b068-4d46-b92e-acbf58c648db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan38e9a17d-b068-4d46-b92e-acbf58c648db-415x250-IndiaHerald.jpgదర్శకుడు హరీష్ శంకర్ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆ అభిమానంతోనే సంవత్సరాలు తరబడి పవన్ తో సినిమా చేయాలని ఎదురుచూపులకు ఎట్టకేలకు పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు ఆసినిమా షూటింగ్ ఆగిపోయింది అని అంటున్నారు.కొందరు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో బిజీగా ఉండటంతో ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది అని కొందరు అభిప్రాయ పడుతుంటే మరికొందరు ఈమూవీ కథలో మార్పులు చేసే ఆలోచనలు పవన్ కు ఏర్పడటంతో పవర్ స్టార్ ఈసినిమాను పక్కకు పెట్టాPAVANKALYAN{#}Ajay Devgn;harish shankar;shankar;surya sivakumar;Ravi;Remake;kalyan;Pawan Kalyan;Cinema;bollywood;Newsపవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !PAVANKALYAN{#}Ajay Devgn;harish shankar;shankar;surya sivakumar;Ravi;Remake;kalyan;Pawan Kalyan;Cinema;bollywood;NewsWed, 19 Jul 2023 14:11:16 GMTదర్శకుడు హరీష్ శంకర్ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆ అభిమానంతోనే సంవత్సరాలు తరబడి పవన్ తో సినిమా చేయాలని ఎదురుచూపులకు ఎట్టకేలకు పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు ఆసినిమా షూటింగ్ ఆగిపోయింది అని అంటున్నారు.


కొందరు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో బిజీగా ఉండటంతో ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది అని కొందరు అభిప్రాయ పడుతుంటే మరికొందరు ఈమూవీ కథలో మార్పులు చేసే ఆలోచనలు పవన్ కు ఏర్పడటంతో పవర్ స్టార్ ఈసినిమాను పక్కకు పెట్టాడు అన్నవార్తలు  ఉన్నాయి. దీనితో హరీష్ శంకర్ పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు సానుభూతి చూపించారు.


ఇలాంటి పరిస్థితుల మధ్య రవితేజా హరీష్ శంకర్ కు సంబంధించిన మూవీ ప్రాజెక్ట్ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ మూవీకి రీమేక్ గా ఈమూవీ ఉంటుందని అంటున్నారు. ఈసినిమాకు గతంలో సూర్య హీరోగా వచ్చిన ‘గ్యాంగ్’ తో కొంచెం దగ్గర పోలిక ఉంటుంది. నగరంలో పలుకుబడి ఉన్న పెద్దమనిషి ఇంటికి ఇన్కమ్ టాక్స్ అధికారులు రైడింగ్ కోసం వచ్చిన సందర్భంలో ఆదాయపు పన్ను అధికారిని ఆదాయపు పన్ను అధికారి  మధ్య  జరిగే పరిణామాల నేపథ్యంలో రైడ్ కధ  సాగుతుంది.


హిందీలో ఈమూవీ హిట్ అయిన విషయం  తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీని హరీష్ శంకర్ రవితేజాతో నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ మూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పవన్ కళ్యాణ్ ఆలశ్యంతో మధన పడుతున్న హరీష్ శంకర్ కు రవితేజా ఇస్తున్న సహకారంతో కొంతవరకు ఉపశమనం లభించింది అనుకోవాలి. గతంలో హరీష్ శంకర్ మాస్ మహారాజ కాంబినేషన్ లో హిట్ సినిమాలు వచ్చాయి మళ్ళీ అది రిపీట్ అవ్వబోతోంది అనుకోవాలి..





RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>