PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-delhi-nda-82f0fe50-ea34-4620-ba90-62375dc18ae7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-delhi-nda-82f0fe50-ea34-4620-ba90-62375dc18ae7-415x250-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించేందుకు అన్నీపార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్నీ విషయాల్లోను ఘోరంగా ఫెయిలైందన్నారు. వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను ఎదిరించే వాళ్ళు కావాలని జనాలంతా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే జనసేనకు జనాల్లో మంచి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలంతా తీవ్ర నిరసలో కూరుకుపోయినట్లు పవన్ అన్నారు.pawan delhi nda {#}Reddy;Jagan;Telangana Chief Minister;YCP;Janasena;CM;Government;Bharatiya Janata Party;Pawan Kalyanఢిల్లీ : సీఎం పదవిపై తేల్చేశారా ?ఢిల్లీ : సీఎం పదవిపై తేల్చేశారా ?pawan delhi nda {#}Reddy;Jagan;Telangana Chief Minister;YCP;Janasena;CM;Government;Bharatiya Janata Party;Pawan KalyanWed, 19 Jul 2023 05:00:00 GMT



ముఖ్యమంత్రి పదవి తీసుకునే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చిసినట్లే ఉన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలు గెలుచుకునే  సీట్ల ఆధారంగా నిర్ణయమవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని చాలా కాన్ఫిడెంటుగా చెప్పారు. మరి పవన్ కాన్ఫిడెన్స్ ఏమిటో మాత్రం ఎవరికీ తెలీదు.





జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించేందుకు అన్నీపార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్నీ విషయాల్లోను ఘోరంగా ఫెయిలైందన్నారు. వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను ఎదిరించే వాళ్ళు కావాలని జనాలంతా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే జనసేనకు జనాల్లో మంచి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలంతా తీవ్ర నిరసలో కూరుకుపోయినట్లు పవన్ అన్నారు.





మీడియాలో కనిపిస్తున్న దానికి వాస్తవ పరిస్ధితులకు అసలు పొంతనే లేదని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ఏమి మాట్లాడుతారో తనకే తెలీదు. ఈరోజు మాట్లాడిన మాట రేపు తనకే గుర్తుండదు. అందుకనే ఒకరోజు మాట్లాడిన మాటకు ఇంకోరోజు పూర్తి విరుద్ధంగా మట్లాడుతారు. ఢిల్లీలో తాను ముఖ్యమంత్రిని కాదని చెప్పేశారు. మరి వారాహియాత్రలో తనను సీఎం చేయమని జనాలను ఎందుకు అడిగారో తెలీదు.





వారాహియాత్ర మొత్తంమీద టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయని ఎక్కడా చెప్పలేదు. పైగా పొత్తులు ఎన్నికల సమయంలో మాత్రమే నిర్ణయిస్తామన్నారు. మరిపుడేమో మూడుపార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని చెప్పారు.  జనసేనకు జనాల ఆదరణ విపరీతంగా పెరిగిపోతోందన్నారు. దానికి ఉదాహరణ ఏమిటంటే వారాహియాత్రలో పాల్గొన్న జనాలే అన్నారు. నిజానికి యాత్రలో పాల్గొన్న మామూలు జనాలు తక్కువ. పాల్గొన్నవాళ్ళల్లో అత్యధికులు పవన్ అభిమానులే. జగన్ హయాంలో డేటాచోరి జరుగుతున్నది అంటున్న పవన్ మరి చంద్రబాబునాయుడు హయాంలో సేవామిత్ర యాప్ ద్వారా జరిగింది కూడా ప్రజల డేటాచోరీనే కదా ? మరప్పుడు ఎందుకు  నోరిప్పలేదు ?  




RRR Telugu Movie Review Rating

హాట్ స్టిల్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న కాజల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>