MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movieb23259d7-67a2-441e-9230-3ec92bbaa332-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movieb23259d7-67a2-441e-9230-3ec92bbaa332-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా వరుసపజయాలు అందుకుంటున్నారు. అయితే ఈసారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆయన 'జైలర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటూ మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్ ఇందులో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టుJailer Movie{#}Dilip Kumar;Kumaar;Rajani kanth;tamannaah bhatia;Kannada;Leader;Comedian;lord siva;Chitram;Shiva;Success;Telugu;Darsakudu;Director;Cinema;Tamil;Heroరజినీకాంత్ 'జైలర్' స్టోరీ లైన్ లీక్..?రజినీకాంత్ 'జైలర్' స్టోరీ లైన్ లీక్..?Jailer Movie{#}Dilip Kumar;Kumaar;Rajani kanth;tamannaah bhatia;Kannada;Leader;Comedian;lord siva;Chitram;Shiva;Success;Telugu;Darsakudu;Director;Cinema;Tamil;HeroWed, 19 Jul 2023 21:00:00 GMTకోలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా వరుసపజయాలు అందుకుంటున్నారు. అయితే ఈసారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆయన 'జైలర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటూ మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్ ఇందులో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో 'జైలర్' మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారం సినిమాలో రజనీకాంత్ ఓ జైలుకి వార్డెన్ గా కనిపిస్తారట. రజినీకాంత్ వార్డెన్ గా ఉన్న జైలుని ఓ విలన్ గ్యాంగ్ బ్రేక్ చేయాలని చూస్తారు. జైలులో ఆ గ్యాంగ్ కు సంబంధించిన లీడర్ ఉంటారు. జైల్లో ఉన్న మిగతా స్టాఫ్ ఆ సమస్యను ఎలా ఎదురుకోవాలో అర్థం కాక తప్పుకోగా ఆ సమయంలో రజనీకాంత్ సింగిల్ గా ఆ గ్యాంగ్ నుంచి జైలుని కాపాడుతూ..

ఆ గ్యాంగ్ వాళ్ళ లీడర్ ని జైలు నుంచి వెళ్ళనివ్వకుండా చేస్తాడట.అంతేకాదు ఫస్టాఫ్ లో రజనీకాంత్ జైలులో ఉన్న వాళ్ళతో చేసే ఫన్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో వింటేజ్ రజనీకాంత్ ని గుర్తుచేసేలా సినిమాను తీర్చిదిద్దారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో రజనీకాంత్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణతోపాటు మన కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నారు. దీంతో తమిళం తో పాటు తెలుగులోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా దర్శకుడి గత చిత్రం 'బీస్ట్' కూడా ఇలాంటి స్టోరీ లైన్ తోనే ఉంటుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. మళ్లీ అలాంటి కథా, కథనాలతోనే ఈ 'జైలర్' సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు ఉచిత ఆపరేషన్స్ చేయించడానికి కారణం అదా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>