MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhate389d116-dc5e-49d0-a3d9-52e9035a3bf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhate389d116-dc5e-49d0-a3d9-52e9035a3bf0-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది ట్రిపులర్ సినిమాతో తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది.ఇక సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తోంది అలియా భట్. ఇప్పటికే చిన్నపిల్లల కోసం 'ఎడ్ - ఏ - మమ్మా'(Ed - A - Mamma) అనే దుస్తుల బ్రాండ్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. 2020లో ఈ దుస్తుల బ్రాండ్ కంపెనీని ప్రారంభించింది. అయితే తాజాగా ఈ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కAlia Bhat{#}Mukesh;prema;Reliance;rani;Heroine;Success;Telugu;Karan Johar;Alia Bhatt;Love;News;Cinema;bollywoodఆలియా భట్ తో 300 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ అధినేత అంబానీ..?ఆలియా భట్ తో 300 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ అధినేత అంబానీ..?Alia Bhat{#}Mukesh;prema;Reliance;rani;Heroine;Success;Telugu;Karan Johar;Alia Bhatt;Love;News;Cinema;bollywoodWed, 19 Jul 2023 21:10:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది ట్రిపులర్ సినిమాతో తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది.ఇక సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తోంది అలియా భట్. ఇప్పటికే చిన్నపిల్లల కోసం 'ఎడ్ - ఏ - మమ్మా'(Ed - A - Mamma) అనే దుస్తుల బ్రాండ్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. 2020లో ఈ దుస్తుల బ్రాండ్ కంపెనీని ప్రారంభించింది. అయితే తాజాగా ఈ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అంబానీ ఆలియా భట్ తో భారీ డీల్ కూడా సెట్ చేసుకున్నట్లు సమాచారం.

 రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ప్రస్తుతం వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. గత ఏడాది ఆగస్టులో రిలయన్స్ రిటైల్ హెడ్గా తన కూతురు ఇషా అంబానీ నియమించారు ముఖేష్ అంబానీ. ఇక ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం ఆలియా భట్ దుస్తుల కంపెనీని అంబానీ కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ దుస్తుల బ్రాండ్ కంపెనీని రిలయన్స్ రిటైల్ సుమారు 300 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆలియా భట్ తో డీల్ కుదుర్చుకున్నారట. ఈ బిజినెస్ డీల్ కి సంబంధించిన డిస్కషన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన అలియా భట్ తన దుస్తుల కంపెనీని మరింత విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఇంతలోనే ఇప్పుడు అంబానీ ఆలియా భట్ దుస్తుల బ్రాండ్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. కాగా 'ఎడ్ ఏ మమ్మా' అనే పేరుతో ఆలియా భట్ చిన్న పిల్లల కోసం ప్రారంభించిన ఈ దుస్తుల బ్రాండ్ కంపెనీలో 2 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి అన్ని రకాల దుస్తులు దొరుకుతాయి. అంతేకాకుండా ఈ ఏడాది నుండి కొత్తగా ఆడపిల్లల కోసం దుస్తులు, స్లీప్ షూట్లు, బాడీ సూట్లు సైతం విక్రయిస్తున్నారు. ఇక అలియా భట్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహాని' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ సింగ్ కపూర్ నటిస్తున్న ఈ సినిమా జూలై 27 న విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు ఉచిత ఆపరేషన్స్ చేయించడానికి కారణం అదా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>