LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healtha684e411-b488-4079-9ad7-3847c70a998e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healtha684e411-b488-4079-9ad7-3847c70a998e-415x250-IndiaHerald.jpgనేటి కాలంలో చాలా మంది కూడా ఎసిడిటీ, అల్సర్స్, కడుపులో మంట ఇంకా పుల్లటి త్రేన్పులు వంటి జీర్ణసంబంధిత సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. సాధారణంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాసిడ్ గాడత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ వల్ల పొట్ట అంచులు దెబ్బతినకుండా ఉండడానికి మన పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది.ఒత్తిడి, ఆందోళన, కాఫీ, టీ లను ఎక్కువగా తhealth{#}Ulcer;Evening;Manamఎసిడిటీ, అల్సర్, కడుపులో మంట ఈజీగా తగ్గాలంటే?ఎసిడిటీ, అల్సర్, కడుపులో మంట ఈజీగా తగ్గాలంటే?health{#}Ulcer;Evening;ManamWed, 19 Jul 2023 14:39:00 GMTనేటి కాలంలో చాలా మంది కూడా ఎసిడిటీ, అల్సర్స్, కడుపులో మంట ఇంకా పుల్లటి త్రేన్పులు వంటి జీర్ణసంబంధిత సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. సాధారణంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతున్న సంగతి  తెలిసిందే. అయితే ఈ యాసిడ్  గాడత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ వల్ల పొట్ట అంచులు దెబ్బతినకుండా ఉండడానికి మన పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది.ఒత్తిడి, ఆందోళన, కాఫీ, టీ లను ఎక్కువగా తాగడం, మంచి నీటిని తక్కువగా త్రాగడం, అనేక రకాల మందులను వాడడం ఇంకా జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఈ జిగురు ఉత్పత్తి తగ్గుతుంది. పొట్ట అంచుల వెంబడి ఈ జిగురు ఉత్పత్తి తగ్గడం వల్ల అల్సర్స్, ఎసిడిటీ ఇంకా ప్రేగు పూతలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది కూడా ప్రతి రోజూ మందులను వాడుతూ ఉంటారు. ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి భవిష్యత్తులో అల్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అరటి పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ అరటి పండులో లైకోసైడిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది జిగురు పొరల నుండి జిగురు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అరటి పండును తీసుకోవడం వల్ల అల్సర్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పరిశోధల ద్వారా తెలిసింది. ఇంకా అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల పొట్టలో వచ్చే ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది.జంక్ ఫుడ్ ను తీసుకున్నాక కలిగే హానిని తగ్గించడంలో కూడా అరటి పండు మనకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు  నిరూపించారు.ఈ అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు రోజుకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా రెండు అరటి పండ్లను తినవచ్చు.అల్సర్ సమస్యతో పాటు అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా రోజూ సాయంత్రం ఒక అరటి పండును తీసుకోవచ్చు. ఎందుకంటే అరటి పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఈ విధంగా అరటి పండును తీసుకోవడం వల్ల అల్సర్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు మన దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ లేడీ డైరెక్టర్ తో సూర్య మరో రియల్ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>