MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas026abdfc-2ea8-4cdf-bd94-7b0420d559b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas026abdfc-2ea8-4cdf-bd94-7b0420d559b4-415x250-IndiaHerald.jpgప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ కె’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. 5 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనె కమలహాసన్ లు నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై మరింత ఆశక్తి పెరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ ను ఈనెల 20వ తారీఖున అమెరికాలో జరగబోతున్న కామిక్ కాన్ ఫెస్టివెల్ లో లాంచ్ చేయబోతున్న పరిస్థితులలో ఈ మూవీ ట్రైలర్ గురించి అందరు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ మూవీకి ‘కాలచక్రం’ అన్న టPRABHAS{#}nag ashwin;Amitabh Bachchan;Shakti;Darsakudu;Prabhas;vishnu;January;Cinema;Directorకాలచక్రం వైపు అడుగులు వేస్తున్న ప్రభాస్ !కాలచక్రం వైపు అడుగులు వేస్తున్న ప్రభాస్ !PRABHAS{#}nag ashwin;Amitabh Bachchan;Shakti;Darsakudu;Prabhas;vishnu;January;Cinema;DirectorWed, 19 Jul 2023 09:00:00 GMTప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ కె’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. 5 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనె కమలహాసన్ లు నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై మరింత ఆశక్తి పెరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ ను ఈనెల 20వ తారీఖున అమెరికాలో జరగబోతున్న కామిక్ కాన్ ఫెస్టివెల్ లో లాంచ్ చేయబోతున్న పరిస్థితులలో ఈ మూవీ ట్రైలర్ గురించి అందరు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ మూవీకి ‘కాలచక్రం’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పురాణాలలో వినిపించే ‘కాలచక్రం’ అన్నపదం ఆధారంగా ఈ మూవీ కథ అల్లినట్లు తెలుస్తోంది. మూవీ కథలోని ప్రభాస్ పాత్ర శ్రీమహా విష్ణు అంశతో పుట్టినట్లు చూపెడుతూ ఉండటంతో ఈలోకాన్ని శాసించే మహత్తర శక్తి అయిన ‘కాలచక్రం’ నేపద్యంలో ఈమూవీ కథ ఒక ఫ్యాంటసీ గా ఉంటుందని లీకులు వస్తున్నాయి.

భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ప్రతిబింబించే విధంగా కొన్ని సంఘటనలు ఈ కథలో అంతర్లీనంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా కథ పెద్దది కావడంతో ఈమూవీ రెండు పార్ట్ లుగా నిర్మిస్తున్నారు. ఈసినిమా మొదటి భాగం వచ్చే సంవత్సరం జనవరి 12న విడుదల కాబోతోంది. కామిక్ కాన్ ఫెస్టివెల్ లో ఈసినిమా ట్రైలర్ లాంచ్ అయిన దగ్గర నుండి మూవీ ప్రమోషన్ చాల ముందుగా ప్రారంభం కాబోతోంది.

‘మహానటి’ మూవీ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఈ మూవీ కథ పై  దర్శకుడు చాల దృష్టి పెట్టడమే కాకుండా ‘కాలచక్రం’ సిద్ధాంతం పై చాల లోతుగా పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయబోతున్న ఈమూవీ ప్రభాస్ కెరియర్ లో రికార్డులను బ్రేక్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి..





RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>