DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan6de55a06-ce27-4f13-b552-de47af444ec7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan6de55a06-ce27-4f13-b552-de47af444ec7-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి వెనకాడుతారని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో రాజ్యసభ ఎన్నికలు దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉండటం వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో మరో మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో దాన్ని ఏ మాత్రం పొగొట్టుకోవడం ఆయన ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 12 రాజ్యసభ స్థానాలు అంటే దేశంలోనే కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడో స్థానానికి వైసీపీ చేరుతుంది. దీని వల్ల రాజ్యసభ లో పార్టీ బలం పెరుగుతుంది. ఏదైనా చట్టం చేయాలన్నా, వద్దనుకుJAGAN{#}Rajya Sabha;Bharatiya Janata Party;Party;YCP;Jagan;Elections;Janasenaవచ్చే ఎన్నికలకు జగన్‌ గెలుపు వ్యూహం ఇదే?వచ్చే ఎన్నికలకు జగన్‌ గెలుపు వ్యూహం ఇదే?JAGAN{#}Rajya Sabha;Bharatiya Janata Party;Party;YCP;Jagan;Elections;JanasenaWed, 19 Jul 2023 10:00:00 GMTసీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి వెనకాడుతారని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో రాజ్యసభ ఎన్నికలు దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉండటం వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో మరో మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో దాన్ని ఏ మాత్రం పొగొట్టుకోవడం ఆయన ఇష్టపడటం లేదని తెలుస్తోంది.


12 రాజ్యసభ స్థానాలు అంటే దేశంలోనే కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడో స్థానానికి వైసీపీ చేరుతుంది. దీని వల్ల రాజ్యసభ లో పార్టీ బలం పెరుగుతుంది. ఏదైనా చట్టం చేయాలన్నా, వద్దనుకున్న వైసీపీకి అవకాశం వస్తుంది. కాబట్టి రాజ్యసభ సీట్లపై వైసీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సజ్జల కూడా తొమ్మిది నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు చురుగ్గా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.


దీంతో జగన్ ముందస్తుకు వెళ్లడని తేలిపోయింది. కాబట్టి ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రతిపక్షాల తీరును ఎండగట్టేలా.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించేలా ప్రయత్నాలు చేయనున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి వస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం, ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉందో గమనించడం తద్వారా పార్టీని ప్రజల్లో నిలపడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.


వచ్చే తొమ్మిది నెలలు వైసీపీ కి కీలకం కానుంది. జగన్ అనుకున్నట్లు 175 స్థానాలు గెలవాలంటే పార్టీలోని వ్యతిరేక వర్గంని సైతం కలుపుకుపోవాలి. అసంతృప్తులను బుజ్జగించాలి. సంక్షేమ పథకాల తీరును వివరించగలగాలి. వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థతో పాటు నాడు నేడు, అమ్మ ఒడి లాంటి పథకాలు మరింత ప్రజల్లోకి వెళ్లగలిగేలా చేయాలి. దీంతో పాటు ఏయే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నారో చూసి వారిని ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సూచిస్తే రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>