PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pwan-cpi-narayana-bjp-a5873d28-04b8-4e3e-a2b8-59ebc0ade9ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pwan-cpi-narayana-bjp-a5873d28-04b8-4e3e-a2b8-59ebc0ade9ab-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని నారాయణ అనుకుంటున్నారు. కాబట్టి తాము కూడా వీళ్ళతో కలిసి ఎన్నికలకు వెళ్ళాలన్నది ఎర్రన్న ఆలోచన. పొత్తులో సీపీఐకి కూడా రెండు సీట్లు దొరక్కపోతుందా పది ఓట్లు పడకపోతాయా అన్నది ఎర్రన్న ఆశ. బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్న ఏ పార్టీతో కూడా సీపీఐ పొత్తు పెట్టుకోదన్న విషయం అందరికీ తెలిసిందే. తమను పొత్తునుండి దూరంగా ఉంచేందుకే టీడీపీ-బీజేపీ పొత్తుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నది నారాయణ మంట. pwan cpi narayana bjp {#}CPI;politics;Janasena;Pawan Kalyanహైదరాబాద్ : పవన్ పై నారాయణ సూపర్ సెటైర్లుహైదరాబాద్ : పవన్ పై నారాయణ సూపర్ సెటైర్లుpwan cpi narayana bjp {#}CPI;politics;Janasena;Pawan KalyanWed, 19 Jul 2023 09:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎర్రన్న అదేనండి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏకిపారేశారు. పవన్ రాజకీయాలపై సూపర్ సెటైర్లు వేశారు. మూడు నిముషాలు కదలకుండా ఒకచోట నిలబడి మాట్లాడితే ఆ తర్వాత పవన్ స్ధిరమైన రాజకీయాలు గురించి మాట్లాడచ్చని ఎద్దేవా చేశారు. పవన్ పైన కొంతకాలంగా నారాయణకు బాగా మండిపోతోంది. కారణం ఏమిటంటే బీజేపీతో పవన్ అంటకాగుతుండటమే.





రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని నారాయణ అనుకుంటున్నారు. కాబట్టి తాము కూడా వీళ్ళతో కలిసి ఎన్నికలకు వెళ్ళాలన్నది ఎర్రన్న ఆలోచన. పొత్తులో సీపీఐకి కూడా రెండు సీట్లు దొరక్కపోతుందా పది ఓట్లు పడకపోతాయా అన్నది ఎర్రన్న ఆశ. బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్న ఏ పార్టీతో  కూడా సీపీఐ పొత్తు పెట్టుకోదన్న విషయం అందరికీ తెలిసిందే. తమను పొత్తునుండి దూరంగా ఉంచేందుకే టీడీపీ-బీజేపీ పొత్తుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నది నారాయణ మంట.





అందుకనే పవన్ పై సెటైర్లు వేశారు. నిన్నటివరకు చెగువేరా దుస్తులు వేసుకుని తిరిగిన పవన్ సడెన్ గా వీర సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు రెడీ అయిపోయారని ఎద్దేవా చేశారు. రేపు గాడ్సేలా తుపాకి పట్టుకునేందుకు కూడా సిద్ధమవుతాడేమో అని రెచ్చిపోయారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ హాజరవ్వటాన్ని ఎర్రన్న తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ ఒక దళారీ అని అందుకనే టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయానికి సిద్ధపడినట్లు మండిపోయారు.





ఇలాంటి మధ్యవర్తిత్వం పవన్ కు ఎంతమాత్రం మంచిదికాదని బుద్ధులు చెప్పారు. గతంలో పవనే ప్రత్యేకప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పవన్ ఎలా అంటకాడుతారని నిలదీశారు. బీజేపీతో కలవటం అంటే లౌకిక వాదానికి దూరంగా జరగటమే అని స్పష్టంగా చెప్పారు. ఎన్డీయేలో ఎలా కంటిన్యు అవుతున్నాడో పవన్ జనాలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే పనైన సమయంలో పవన్ సమావేశానికి హాజరవ్వటాన్ని నారాయణ తప్పుపట్టారు.




RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>