PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-purandeswari-jaganb151e2d7-a18d-4221-af79-f781a258a662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-purandeswari-jaganb151e2d7-a18d-4221-af79-f781a258a662-415x250-IndiaHerald.jpgప్రజల్లో ప్రభుత్వమంటే విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని పురందేశ్వరి నేతలకు స్పష్టంగా చెప్పారు. ఇక్కడే పురందేశ్వరి మాటలు చాలామంది అర్ధంకావటంలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది నిజమే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా అంతా టీడీపీకి వెళుతుందే కానీ బీజేపీకి ఎలాగ వస్తుంది ? ఎందుకంటే కేంద్రప్రభుత్వం మీద అంతకుమించిన వ్యతిరేకత ఉందన్న విషయం పురందేశ్వరికి తెలీదా ? bjp purandeswari jagan{#}polavaram;Polavaram Project;Vishakapatnam;Jagan;Rayalaseema;Andhra Pradesh;Reddy;Daggubati Purandeswari;Government;Narendra Modi;Partyఅమరావతి : పురందేశ్వరికి షాక్ తప్పదా ?అమరావతి : పురందేశ్వరికి షాక్ తప్పదా ?bjp purandeswari jagan{#}polavaram;Polavaram Project;Vishakapatnam;Jagan;Rayalaseema;Andhra Pradesh;Reddy;Daggubati Purandeswari;Government;Narendra Modi;PartyTue, 18 Jul 2023 09:00:00 GMT


ప్రతిపక్షపార్టీగా సొంతంగా ఎదగాలని, బలోపేతమవ్వాలని కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చాలా పెద్దమాటలే మాట్లాడారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ నేతల మొదటి సమావేశంలో మాట్లాడుతు ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, విమర్శలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది అరాచకమన్నారు. ప్రజలను జగన్ ప్రభుత్వం మోసంచేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని మండిపోయారు.





ప్రజల్లో ప్రభుత్వమంటే విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని పురందేశ్వరి నేతలకు స్పష్టంగా చెప్పారు. ఇక్కడే పురందేశ్వరి మాటలు చాలామంది అర్ధంకావటంలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది నిజమే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా అంతా టీడీపీకి వెళుతుందే కానీ బీజేపీకి ఎలాగ వస్తుంది ? ఎందుకంటే కేంద్రప్రభుత్వం మీద అంతకుమించిన వ్యతిరేకత ఉందన్న విషయం పురందేశ్వరికి తెలీదా ? ఈ వ్యతిరేకత ఇప్పట్లో పోయేలా లేదు.





విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం విభజన చట్టాన్ని అమలుచేయకుండా ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేశారు. ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వనని చెప్పేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వటంలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధులు ఆపేశారు. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, జనాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటంలేదు.





కేంద్రాన్ని సమర్ధించలేక, ప్రజలకు మద్దతుగా నిలవలేక పురందేశ్వరి నుండి చాలామంది కమలనాదులు అబద్ధాలు చెప్పినవాళ్ళే కదా. అందుకనే జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో ఎందులోను బీజేపీకి డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ పురందేశ్వరికి తెలీదా ? కాబట్టి భవిష్యత్తులో  ఎన్నిక ఏదైనా బీజేపీకి డిపాజిట్లు రావటం కూడా కష్టమే. ఇలాంటి సమయంలో ప్రెసిడెంట్ అవటం పురందేశ్వరి దురదృష్టమని సరిపెట్టుకోవాల్సిందే. ఉన్న కొద్దినెలలు సోము వీర్రాజుతోనే నెట్టుకొచ్చేసుంటే సరిపోయేది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పురందేశ్వరికి పెద్ద షాక్ తప్పేట్లు లేదు.




RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>