MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్స్ పద్దతికి భిన్నంగా సాయి పల్లవి వ్యక్తిత్వం ఉంటుంది. అవకాశం దొరికితే చాలు చాలమంది స్టార్ హీరోయిన్స్ యూరప్ వెళ్ళి అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా సాయి పల్లవి ఈమధ్య అమరనాథ్ యాత్రకు వెళ్ళింది. తాను మాత్రమే కాకుండా తన తల్లిని తండ్రిని కూడ ఈ యాత్రకు తీసుకు వెళ్ళింది.చిన్నతనంలో పుట్టపర్తి సత్య సాయి బాబ స్కూల్ లో ఆమె చదువు కోవడం వల్ల చిన్నతనం నుండి ఆమెకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఆమె అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో saipallavi{#}amar;School;lord siva;Heroine;Yatra;Sai Pallavi;Puttaparthi;Teluguఅమరనాథ్ యాత్రలో సాయి పల్లవి సందడి !అమరనాథ్ యాత్రలో సాయి పల్లవి సందడి !saipallavi{#}amar;School;lord siva;Heroine;Yatra;Sai Pallavi;Puttaparthi;TeluguTue, 18 Jul 2023 09:00:00 GMTస్టార్ హీరోయిన్స్ పద్దతికి భిన్నంగా సాయి పల్లవి వ్యక్తిత్వం ఉంటుంది. అవకాశం దొరికితే చాలు చాలమంది స్టార్ హీరోయిన్స్ యూరప్ వెళ్ళి అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా సాయి పల్లవి ఈమధ్య అమరనాథ్ యాత్రకు వెళ్ళింది. తాను మాత్రమే కాకుండా తన తల్లిని తండ్రిని కూడ ఈ యాత్రకు తీసుకు వెళ్ళింది.




చిన్నతనంలో పుట్టపర్తి సత్య సాయి బాబ స్కూల్ లో ఆమె చదువు కోవడం వల్ల చిన్నతనం నుండి ఆమెకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఆమె అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన యాత్ర అనుభవాలను అందరితోనూ షేర్ చేసుకుంది.




తనకు అమర్‌నాథ్ యాత్ర చేయాలని ఎప్పట్నుంచో కోరిక ఉన్న విషయాన్ని తన అభిమానులకు షేర్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘అమర్‌నాథ్ యాత్ర నా సంకల్ప శక్తిని సవాల్ చేసింది. నా ధైర్యాన్ని పరీక్షించింది. ఈ యాత్రకు వెళ్లాలన్నది ఎప్పట్నుంచో నాకున్న కోరిక ఈసారి వీలు కుదిరింది. దీనితో అమ్మా నాన్నలను కూడా తీసుకెళ్లా. కానీ ఇది మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి కూడా తీసుకోలేకపోయారు. ఛాతీ పట్టుకుని ఆయాసపడ్డారు. మధ్యలోనే ఆగిపోయారు. దీనితో దేవుడా నువ్వెందుకు అంత దూరంలో ఉన్నావు అని ప్రశ్నించాను.




ఆతరువాత యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు చాలమంది పెద్దవాళ్ళు పడ్డ బాధను తన కంటితో చూశానని అయితే ఆ బాధను పట్టించుకోకుండా వారాంత ‘ఓం నమ:శివాయ’ అని బిగ్గరగా అరుస్తూ ముందుకు సాగడం చూసిన తనకు జీవితమే ఒక తీర్థయాత్ర అన్న ఫీలింగ్ కలిగిందని సాయి పల్లవి కామెంట్స్ చేసింది. అమరనాథ్ యాత్ర తన జీవితంలో మారిచిపోలేను అంటూ తనకు ఇలాంటి అవకాశం కలిగించిన శివుడు కి ధన్యవాదాలు తెలియచేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె తమిళంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే..





RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>