MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/jagan-formers3426b194-c6e6-4553-9bae-de878c4c2484-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/jagan-formers3426b194-c6e6-4553-9bae-de878c4c2484-415x250-IndiaHerald.jpgతాజాగా ఏపీలో ఎన్నికల వేళ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే విధంగా జగన్ వరుస పెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే తాజాగా రుణమాఫీ అనే అంశం కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ పథకం పై ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు విషయంలోకి వెళితే వచ్చే ఏడాది రాబోయే ఎన్నికల్లో గెలుపు పక్కా అనే ఉద్దేశంతో కనిపిస్తున్న జగన్ వై నాట్ 175 అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. JAGAN; FORMERS{#}Qualification;Coronavirus;TDP;JaganMoney: ఏపీ రైతులకు శుభవార్త.. రుణమాఫీ పై చర్చలు..!Money: ఏపీ రైతులకు శుభవార్త.. రుణమాఫీ పై చర్చలు..!JAGAN; FORMERS{#}Qualification;Coronavirus;TDP;JaganTue, 18 Jul 2023 11:00:00 GMTతాజాగా ఏపీలో ఎన్నికల వేళ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే విధంగా జగన్ వరుస పెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే తాజాగా రుణమాఫీ అనే అంశం కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ పథకం పై ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు విషయంలోకి వెళితే వచ్చే ఏడాది రాబోయే ఎన్నికల్లో గెలుపు పక్కా అనే ఉద్దేశంతో కనిపిస్తున్న జగన్ వై నాట్ 175 అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సమయంలోనే అటు టీడీపీ , ఇటు జనసేనలను చావు దెబ్బ కొట్టాలని వ్యూహాలు పన్నుతున్నట్లు అందులో భాగంగానే సరికొత్త పథకాల దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ 2019 అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రణాళికలు అమలు చేస్తూనే ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ఈయన.. కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఇక ఆయన పథకాలు కూడా ఆపలేదు.

అందుకే సంక్షేమం విషయంలోనూ ప్రజలను పట్టించుకునే విషయంలో కూడా జగన్ కి ఫుల్ మార్కులే పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పథకాలను చేరని వారి కోసం మరొక అవకాశాన్ని కల్పిస్తున్నారు. జగన్ రాజకీయాలకు అతీతంగా ఈ పథకాలు అమలు అయ్యేలా చూడాలన్నది మొదటి లక్ష్యం. ఇక ఇదే క్రమంలోనే రైతులను మరింత దగ్గర చేసుకోవడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడానికి రైతులకు రుణమాఫీ ఇవ్వడం పైన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ రుణమాఫీ అనేది ఎన్నికలకు ముందే ఇస్తారా? లేక ఎన్నికల సమయంలో ఇస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టమైన హామీ రాలేదని చెప్పవచ్చు. మొత్తానికైతే రుణమాఫీ పేరుతో రైతులను మరొకసారి ఆకర్షించే దిశగా చర్చలు జరుపుతున్నారు జగన్.



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>