Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-08a9b2b0-81f6-4b51-a126-a3fc14ae9707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-08a9b2b0-81f6-4b51-a126-a3fc14ae9707-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న ఆటగాళ్లందరూ కూడా గాయం బారిన పడుతూ చివరికి జట్టుకు దూరమవుతున్నారు. వెరసి ఇక కీలక ప్లేయర్స్ లేకుండానే టోర్నీలు ఆడేస్తూ ఉంది భారత జట్టు. ఇలా జట్టుకు దూరమైన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకరు. బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సమయంలో గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ అతను గాయం నుంచి కోలుకోలేదు అని చెప్పాలCricket {#}BCCI;World Cup;Shreyas Iyer;Cricket;Indiaనాకే తెల్వదు.. ఇంకేం చెప్తా.. రీ ఎంట్రీపై శ్రేయస్ షాకింగ్ కామెంట్స్?నాకే తెల్వదు.. ఇంకేం చెప్తా.. రీ ఎంట్రీపై శ్రేయస్ షాకింగ్ కామెంట్స్?Cricket {#}BCCI;World Cup;Shreyas Iyer;Cricket;IndiaTue, 18 Jul 2023 14:00:00 GMTఇటీవల కాలంలో టీమిండియాను గాయాల బెడద  తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న ఆటగాళ్లందరూ కూడా గాయం బారిన పడుతూ చివరికి జట్టుకు దూరమవుతున్నారు. వెరసి ఇక కీలక ప్లేయర్స్ లేకుండానే టోర్నీలు ఆడేస్తూ ఉంది భారత జట్టు. ఇలా జట్టుకు దూరమైన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకరు. బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సమయంలో గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ అతను గాయం నుంచి కోలుకోలేదు అని చెప్పాలి.


 అయితే అతను ఎప్పుడూ అందుబాటులోకి వస్తాడు అనే విషయంపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తన గుణరాగమనం గురించి ఇటీవల కుండ బద్దలు కొట్టినట్లు స్పందించాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఎప్పుడు కాలు బయటపెట్టిన ఎంతో మంది సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. వారు ఎప్పుడు మళ్ళీ జట్టులోకి తిరిగి వస్తావు అనే ఒకే ఒక ప్రశ్న వేస్తున్నారు.


 అయితే భారత జట్టులోకి నేను ఎప్పుడు తిరిగి వస్తానో.. నాకే సరిగ్గా తెలియదు అంటూ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవలే అయ్యర్ పునరాగమనం గురించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అయ్యర్ నిదానంగా కోరుకుంటున్నాడు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి అతను జట్టులోకి వచ్చేలా కోలుకుంటున్నాడు. ఇప్పటికి అయితే శ్రేయస్ అయ్యర్ గురించి ఏం చెప్పలేమంటూ వ్యాఖ్యానించాడు. కాగా అతని గాయం విషయంలో బిసిసిఐ నిజంగానే దిగాలుగా ఉంది అని చెప్పాలి. అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతున్నాడు.



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>