MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth7ad3f644-14ca-429a-9118-c7f2db7f765e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth7ad3f644-14ca-429a-9118-c7f2db7f765e-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10 న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి అనిరుRajinikanth{#}editor mohan;jaaki;puneet rajkumar;tamannaah bhatia;Maldives;Beach;Dilip Kumar;Rajani kanth;Kannada;Red;aishwarya;Audience;Cinema;Teluguమాల్దీవ్స్ బీచ్ లో రజినీకాంత్.. ఫోటో వైరల్..!!మాల్దీవ్స్ బీచ్ లో రజినీకాంత్.. ఫోటో వైరల్..!!Rajinikanth{#}editor mohan;jaaki;puneet rajkumar;tamannaah bhatia;Maldives;Beach;Dilip Kumar;Rajani kanth;Kannada;Red;aishwarya;Audience;Cinema;TeluguTue, 18 Jul 2023 21:30:00 GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10 న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన 'కావాలయ్యా' అనే సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

యూట్యూబ్లో ఇప్పటికే ఈ పాట 45 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ పాటలో తమన్నా డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పొచ్చు. ఇక ఈ సాంగ్ తర్వాత తాజాగా 'హుకుమ్' అనే సెకండ్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ఓవైపు ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. రజనీకాంత్ మాత్రం ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా జైలర్ సినిమాతో పాటు తన కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న 'లాల్ సలాం' సినిమా షూటింగ్ని పూర్తి చేసిన రజినీకాంత్ కాస్త విశ్రాంతి కోసం గతవారం మాల్దీవ్స్ కి పయనమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి రజనీకాంత్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా మాల్దీవ్స్ లోని ఓ బీచ్ లో రజనీకాంత్ నడుచుకుంటూ వస్తున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రజనీకాంత్ రెడ్ కలర్ టీ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ వేసుకుని చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు ఫ్యాన్స్ ని నెట్టుజెన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ఫోటో కింద ఫాన్స్ వరుస కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.  దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీకాంత్ పిక్ తెగ వైరల్ అవుతుంది. ఇక జైలర్ సినిమాతో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలాం' అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో 'మొయిద్దీన్ భాయ్' అనే పాత్రలో రజనీకాంత్ కనిపించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కానుంది..!!



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>