MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby57d10aea-a0d1-4c27-ba9d-db272f3eb3ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby57d10aea-a0d1-4c27-ba9d-db272f3eb3ba-415x250-IndiaHerald.jpgఎలాంటి అంచనాలు లేని ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది బేబీ మూవీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విరాజ్ అశ్విన్ మరో హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు.హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాని నిర్పించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి, జర్నలిస్టు నుంచి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. సుమారు BABY{#}sunday;Devarakonda;Varsham;Mass;monday;Hero;Director;Anand Deverakonda;Chaitanya;Telugu;Blockbuster hit;Cinemaవర్కింగ్ డే నాడు కూడా కుమ్మేసిన బేబీ?వర్కింగ్ డే నాడు కూడా కుమ్మేసిన బేబీ?BABY{#}sunday;Devarakonda;Varsham;Mass;monday;Hero;Director;Anand Deverakonda;Chaitanya;Telugu;Blockbuster hit;CinemaTue, 18 Jul 2023 20:49:13 GMTఎలాంటి అంచనాలు లేని ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది బేబీ మూవీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విరాజ్ అశ్విన్ మరో హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు.హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాని నిర్పించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి, జర్నలిస్టు నుంచి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. సుమారు నాలుగున్నర కోట్ల దాకా బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టారు. జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూనే కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మొదటి రోజు రెండు కోట్ల 60 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రెండు కోట్ల 98 లక్షలు మూడో రోజు మూడు కోట్ల 77 లక్షలు షేర్ వసూలు చేసింది.అయితే సోమవారం వంటి వర్కింగ్ డే నాడు కూడా  భారీగా వసూళ్లు రాబట్టింది.


సోమవారం ఏకంగా మూడు కోట్ల 72 లక్షల దాకా వసూలు చేసింది. అంటే ఆదివారం కంటే కేవలం 5 లక్షలు మాత్రమే ఈ సినిమా తక్కువ వసూలు చేసింది. వర్కింగ్ డే రోజు థియేటర్లకు జనాలను రప్పించడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ బేబీ జనాలని ఈజీగా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల్లో ఏకంగా 13 కోట్ల ఏడు లక్షలు షేర్ వసూలు చేసిన ఈ సినిమా 22 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా చోట్ల  56 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో దాదాపుగా కోటి 78 లక్షలు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 41 లక్షలు షేర్ వసూలు చేసిన ఈ సినిమా 28 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూళ్లు చేసింది. నిజానికి ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ కేవలం ఏడుకోట్ల 40 లక్షలకు మాత్రమే జరిగింది.బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవ్వాలంటే 8 కోట్లు రాబట్టాలి. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు ఏకంగా 7 కోట్ల 41 లక్షల లాభాలతో ఈ సినిమా దూసుకుపోతోంది.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>