ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral637d639e-b134-4e85-a310-40bbc41d1aab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral637d639e-b134-4e85-a310-40bbc41d1aab-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏదైనా జాతరలు జరిగినప్పుడు మొక్కుబడిగా ఉంటే తులాభారం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ తులాభారం కింద ఎక్కువగా బియ్యం, ధాన్యం, బెల్లంతో పాటు బంగారం తులాభారం వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించి ఫ్రెండ్ కు తగ్గట్టుగా టమోటోలను తులాభారం వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అసలు విషయంలోకెళితే.. ప్రస్తుతం టమోటోల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ టమాటో లేనిదే వంట చేయడం అసాధ్యం. రోజురోజుకీ టమాటో రేట్లు పెరుగుతూ సామాన్యులకు పరీక్ష పెడుతున్నాయి. ఇంట్లోVIRAL{#}nithya new;Rasam;Anakapalle;Jaggery;vegetable market;Mini;mohini;Father;goldటమోటో లతో కూతురికి తులాభారం వేసిన తండ్రి.. గొప్పోడివి బాసూ..!టమోటో లతో కూతురికి తులాభారం వేసిన తండ్రి.. గొప్పోడివి బాసూ..!VIRAL{#}nithya new;Rasam;Anakapalle;Jaggery;vegetable market;Mini;mohini;Father;goldMon, 17 Jul 2023 14:59:29 GMTసాధారణంగా ఏదైనా జాతరలు జరిగినప్పుడు మొక్కుబడిగా ఉంటే తులాభారం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ తులాభారం కింద ఎక్కువగా బియ్యం, ధాన్యం, బెల్లంతో పాటు బంగారం తులాభారం వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించి ఫ్రెండ్ కు తగ్గట్టుగా టమోటోలను తులాభారం వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అసలు విషయంలోకెళితే.. ప్రస్తుతం టమోటోల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ టమాటో లేనిదే వంట చేయడం అసాధ్యం. రోజురోజుకీ టమాటో రేట్లు పెరుగుతూ సామాన్యులకు పరీక్ష పెడుతున్నాయి.

ఇంట్లో ఏం కూర ఎక్కువ మొత్తంలో చేయాలన్నా.. రసం చేసుకోవాలన్నా.. పచ్చడితో తినాలన్నా సరే ముందుగా టమాటో ని గుర్తుకు వస్తుంది.. ప్రస్తుతం మార్కెట్లో టమాటో ధరలు రూ.120 నుండి రూ .200 వరకు పలుకుతున్నాయి. సుమారుగా నెల రోజులపాటు ఇవే ధరలు ఇలాగే కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే సందట్లో సడే మియా లాగా టమాటో ధర పెరుగుదలపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి.

ఇకపోతే ఇలాంటి సమయంలో ఒక తండ్రి తన కుమార్తెకు టమోటోలతో తులాభారాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో.. నగరానికి చెందిన మల్ల జగ్గా అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు బెల్లంతో మొక్కు చెల్లించుకునేందుకు తులాభారం నిర్వహించగా ఇప్పుడు టమోటో లను బంగారంతో పోలుస్తున్నారు. కాబట్టి ఆయన కూడా తన కుమార్తెను ఇలా టమాటో లతో తులాభారాన్ని నిర్వహించారు. సుమారుగా 50 కిలోలు టమాటో లు వినియోగించారని తెలుస్తోంది. ముందుగా టమాటో లతో కుమార్తె తులాభారాన్ని కొలిచి ఆ తర్వాత పంచదార,  బెల్లం వంటి పదార్థాలతో తులాభారం నిర్వహించారు. వాటిని దేవస్థానానికి అప్పారావు ఫ్యామిలీ అప్పగించగా.. ఈ టమాటో లను నిత్య అన్నదానంలో ఉపయోగిస్తున్నామని దేవస్థానం అధికారులు వెల్లడించారు . అయితే ఈ తులాభారాన్ని చూడడానికి గుడికి వచ్చిన భక్తులు చాలా ఆసక్తిగా చూడడం ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చాలా హల్చల్ చేస్తోంది. టమాటో కోసం మినీ సైజు యుద్ధమే జరుగుతుంటే నువ్వు మాత్రం నీ కూతురికి టమోటో లతో తులాభారం వేసావంటే నువ్వు గొప్పోడివి బాసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

NTR 31లో మరో టాప్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>