PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-pawan-chandrababu17eef6a1-10bd-4512-8a7c-df27e9320154-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-pawan-chandrababu17eef6a1-10bd-4512-8a7c-df27e9320154-415x250-IndiaHerald.jpgఒకపుడు జనసేన, బీజేపీతో కలవటానికి చంద్రబాబు చాలా ఆత్రంచూపారు. అయితే తాజా పరిణామాల్లో జనసేన, బీజేపీతో పొత్తులు వద్దని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీతో కలిస్తే టీడీపీకి ఒక సమస్య కలవకపోతే మరో సమస్యగా మారిపోయింది. అందుకనే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అని చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల్లో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మందిని పవన్ దూరం చేసుకున్నారనే అనుకోవాలి. మామూలుగా ఏ పార్టీ అధినేత అయినా అన్నీ వరjagan pawan chandrababu{#}CBN;Jagan;Bharatiya Janata Party;Janasena;Pawan Kalyan;Party;Congressఅమరావతి : ప్రతిపక్షాల్లోని కన్ఫ్యూజనే జగన్ బలమా ?అమరావతి : ప్రతిపక్షాల్లోని కన్ఫ్యూజనే జగన్ బలమా ?jagan pawan chandrababu{#}CBN;Jagan;Bharatiya Janata Party;Janasena;Pawan Kalyan;Party;CongressMon, 17 Jul 2023 09:00:00 GMT


మామూలుగా ఎక్కడైనా అధికారపార్టీకి ప్రతిపక్షాలు పెద్ద సమస్యగా నిలుస్తాయి. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్షాలే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ గా నిలుస్తున్నాయి. వినటానికి ఇది విచిత్రంగానే ఉన్నా పూర్తిగా చదివితే మీకే తెలుస్తుంది విషయం ఏమిటో. బాహుబలంత వైసీపీని వచ్చేఎన్నికల్లో ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వక తప్పదని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు.





టీడీపీ-జనసేన కలవటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిస్తే వామపక్షాలు, కాంగ్రెస్ కలవవు. ఒకవేళ టీడీపీ, జనసేనతో బీజేపీ కలవదని అనుకుందాం. అప్పుడు పై రెండుపార్టీలతో వామపక్షాలు, కాంగ్రెస్ కలవటానికి అవకాశాలున్నాయి. అంటే ఇక్కడే టీడీపీ, జనసేనతో కలవబోయే మూడో పార్టీ లేదా ఇతర పార్టీలేవి అన్నదే తేలటంలేదు. నిజానికి బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ బలం నామమాత్రం కూడా లేదు. 





ఒకపుడు జనసేన, బీజేపీతో కలవటానికి చంద్రబాబు చాలా ఆత్రంచూపారు. అయితే తాజా పరిణామాల్లో జనసేన, బీజేపీతో పొత్తులు వద్దని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీతో కలిస్తే టీడీపీకి ఒక సమస్య కలవకపోతే మరో సమస్యగా మారిపోయింది. అందుకనే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అని చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల్లో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మందిని పవన్ దూరం చేసుకున్నారనే అనుకోవాలి. మామూలుగా ఏ పార్టీ అధినేత అయినా అన్నీ వర్గాలను దగ్గరకు తీసుకోవాలని చూస్తారు. కానీ పవన్ మాత్రం పై వర్గాలను వారాహియాత్ర పేరుతో కష్టపడి మరీ  దూరం చేసుకుంటున్నారు.





జనసేనతో పొత్తు పెట్టుకున్నా కాపుల ఓట్లు టీడీపీకి పడతాయన్న నమ్మకం ఎవరిలోను లేదు. కాబట్టి పవన్ తో పొత్తుపెట్టుకుని అనవసరంగా సీట్లను ఎందుకు కోల్పోవాలని తమ్ముళ్ళు పదేపదే చంద్రబాబుతో చెబుతున్నారట. ఎప్పుడేమి మాట్లాడుతారో పవన్ కే తెలియని స్ధితిలో పొత్తుపెట్టుకుంటే టీడీపీకి నష్టం గ్యారెంటీ అని తమ్ముళ్ళు  గోలచేస్తున్నారు. బీజేపీ మీద జనాల్లో ఉన్న మంటంతా పొత్తుపెట్టుకున్న పార్టీలపైన కూడా పడుతుందని టీడీపీలోనే టాక్ నడుస్తోంది. అందుకనే బీజేపీతో పొత్తు కోసం తాను ఆలోచించటంలేదని చంద్రబాబు చెప్పింది. మొత్తంమీద ప్రతిపక్షాల్లో ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే  విషయంలో పార్టీల మధ్య అయోమయం పెరిగిపోతోంది. అందుకనే  ప్రతిపక్షాలే జగన్ కు బలమని చెప్పింది .







RRR Telugu Movie Review Rating

నిజమేనా? చైనాలో పేదరికం పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>