Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral-5c76c253-e761-4b5d-8958-37f7b30759dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral-5c76c253-e761-4b5d-8958-37f7b30759dd-415x250-IndiaHerald.jpgవికెట్ల మధ్య రన్స్ తీసేటప్పుడు వేగంగా ఉరకడం చాలా అవసరం. అక్కడ బద్ధకం చూపిస్తే ఔట్ అయిపోవడం ఖాయం. కాగా ఈ విషయాన్ని మరిచి తాజాగా ఒక బ్యాట్స్‌మాన్ క్రీజ్‌లో బద్ధకం ప్రదర్శించాడు. చివరికి అనూహ్య రీతిలో ఔట్ అయ్యాడు. అతడి ఔట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఇది చూసి ఇదేం బద్ధకం అయ్యా బాబు అంటూ తెగ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే, ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, సీటెల్ ఓర్కాస్ మధ్య ఓ మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ Viral {#}geetha;jayasurya music;New Zealand;Athadu;CBN;Cricket;SUNIL GAVASKARపరిగెత్తడానికి కూడా ఇంత బద్ధకమా.. ఈ క్రికెటర్‌ ఎలా రనౌట్ అయ్యాడో చూస్తే?పరిగెత్తడానికి కూడా ఇంత బద్ధకమా.. ఈ క్రికెటర్‌ ఎలా రనౌట్ అయ్యాడో చూస్తే?Viral {#}geetha;jayasurya music;New Zealand;Athadu;CBN;Cricket;SUNIL GAVASKARMon, 17 Jul 2023 14:50:04 GMTవికెట్ల మధ్య రన్స్ తీసేటప్పుడు వేగంగా ఉరకడం చాలా అవసరం. అక్కడ బద్ధకం చూపిస్తే ఔట్ అయిపోవడం ఖాయం. కాగా ఈ విషయాన్ని మరిచి తాజాగా ఒక బ్యాట్స్‌మాన్ క్రీజ్‌లో బద్ధకం ప్రదర్శించాడు. చివరికి అనూహ్య రీతిలో ఔట్ అయ్యాడు. అతడి ఔట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఇది చూసి ఇదేం బద్ధకం అయ్యా బాబు అంటూ తెగ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే, ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, సీటెల్ ఓర్కాస్ మధ్య ఓ మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ రనౌట్ అయిన తీరు అందరి చేత నవ్వులు పూయించింది.  అలెన్ మైదానంలో దిగిన సమయం నుంచి పరుగుల వేటతో దూకుడుగా ఆడాడు, సియాటిల్ కెప్టెన్ వేన్ పార్నెల్ వేసిన ఓపెనింగ్‌ ఓవర్‌లోనే ఐదు బౌండరీలు కొట్టాడు. మొత్తం తొమ్మిది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు.

అయితే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అలెన్ కామెరాన్ గానన్ వేసిన బంతిని మిడ్-వికెట్ వైపు ఆడాడు. సులభమైన సింగిల్‌ని ఆశించాడు. అయితే, ఓర్కాస్ టీమ్ ఫీల్డర్ షెహన్ జయసూర్య వెంటనే బంతిని పట్టుకుని స్టంప్‌పైకి విసిరాడు. దీన్ని గమనించిన అలెన్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌కి చేరుకునే తన బ్యాట్‌ను గీత మీద పెట్టడానికి దానిని క్రీజుపై రాసుకుంటూ వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు, బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోయింది. దాంతో అతడు రనౌట్ అయ్యాడు. అప్పటికే 10 బంతుల్లో 28 పరుగుల చేసిన ఈ ప్లేయర్ ఇంకొంతసేపు ఉంటే ఆ సెంచరీ చేసేవాడు కానీ బద్ధకంగా ప్రవర్తిస్తూ ఫన్నీగా అవుట్ అయ్యి పరువు తీసుకున్నాడు.

యునికార్న్స్ కెప్టెన్, ఆరోన్ ఫించ్ ఔట్‌ పట్ల ప్రత్యక్షంగా అసంతృప్తి వ్యక్తపరిచాడు. కామెంటేటర్లు విల్కిన్స్, సునీల్ గవాస్కర్ ఈ బద్ధకరత్నను బాగా విమర్శించారు, విల్కిన్స్ దీనిని కామెడీగా అభివర్ణించారు. గవాస్కర్ స్లోపీ క్రికెట్ అని అభివర్ణించారు. క్రికెట్ ప్రేక్షకులు కూడా ఇలాంటి రనౌట్ నెవర్ బిఫోర్ ఎవ్వర్‌ ఆఫ్టర్ అంటూ సదర్ క్రికెటర్ ని ఆటపట్టిస్తున్నారు.
">
">



RRR Telugu Movie Review Rating

NTR 31లో మరో టాప్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>