Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/tamatafeef432a-17ab-4c8f-896b-5985f10802c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/tamatafeef432a-17ab-4c8f-896b-5985f10802c5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ టమాటా గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా సామాన్యులకు అయితే టమాటా కన్నీళ్లను తెప్పిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే టమాటా ధరలు ప్రస్తుతం కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులకు టమాట కొనుగోలు చేయడం భారంగా మారిపోయింది. ముఖ్యంగా రేక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న వారు టమాట లేకుండానే ప్రతిరోజు వంటకాలను చేసుకుంటున్నారు అని చెTamata{#}Madhya Pradesh - Bhopal;Cancer;Cheque;indigo airlinesనలుపు రంగు టమాట.. ఇది వెరీ స్పెషల్ గురూ?నలుపు రంగు టమాట.. ఇది వెరీ స్పెషల్ గురూ?Tamata{#}Madhya Pradesh - Bhopal;Cancer;Cheque;indigo airlinesMon, 17 Jul 2023 10:05:00 GMTప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ టమాటా గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా సామాన్యులకు అయితే టమాటా కన్నీళ్లను తెప్పిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే టమాటా ధరలు ప్రస్తుతం కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులకు టమాట కొనుగోలు చేయడం భారంగా మారిపోయింది. ముఖ్యంగా రేక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న వారు టమాట లేకుండానే ప్రతిరోజు వంటకాలను చేసుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇక ప్రస్తుతం టమాట ధర ప్రతి రాష్ట్రంలో కూడా 100 రూపాయలకు పైగానే పలుకుతుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా 200 రూపాయల వరకు టమాటా ధర పలుకుతూ ఉండటం గమనార్హం. దాదాపు నెలరోజుల క్రితం 20 రూపాయలు ఉన్న టమాటా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోవడంతో అటు టమాటా రైతులు లాభాల్లో మునిగి తేలుతున్నారు. కానీ సామాన్యులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టమాటాకు సంబంధించి ఏ చిన్న వార్త తెరమీదకి వచ్చిన అది హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.


 సాధారణంగా టమాటా ఏ రంగులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎరుపు రంగుతో తల తల మెరిసిపోతూ ఉంటుంది. కానీ టమాటాలు నల్ల రంగులో ఉంటాయి అన్న విషయం తెలుసా అంటే.. తెలీదు అని ప్రతి ఒక్కరు సమాధానం చెబుతారు. అయితే ఇప్పుడు నలుగురంగు టమాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోయింది. ఎరుపు, ఉదా రంగు విత్తనాలను సేకరించి ఇక ఈ నలుపు రంగుల టమాటాలను సృష్టించారట. ఈ టమాటాను ఇండిగో రోజ్ అని పిలుస్తారట. క్యాన్సర్ తో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ టమాటా చెక్ పెడుతుందట. హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ లలో ప్రస్తుతం ఈ నలుపు రంగు టమాటాలను సాగు చేస్తున్నారట. ఏపీలో కూడా ఇక ఈ నలుపు రంగు టమాటా సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నిజమేనా? చైనాలో పేదరికం పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>