LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tamota-rate-venuka-chedu-nijalu85d03c2c-dc4d-4a8a-846d-3063cc148c04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tamota-rate-venuka-chedu-nijalu85d03c2c-dc4d-4a8a-846d-3063cc148c04-415x250-IndiaHerald.jpgరైతులు ఎన్ని రోజులు నష్టపోయినా కూడా ఏ రోజు ఒక్కరు అన్నదాత గురించి పోస్టులు పెట్టరు. కానీ ఉల్లిపాయ రేటు పెరిగిందని టమాట ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, పచ్చి మిర్చి కొనలేకపోతున్నామని సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వాడుతుంటారు. ట్రోల్స్ చేస్తుంటారు. ఇలా ఇష్టారీతిన ప్రవర్తిస్తుంటారు. అయితే ధరల పెరుగుదల ఇండియాలో పంటల అంశంపై అమరనాథ్ వాసిరెడ్డి అనే సామాజిక విశ్లేషకులు పోస్టు లో ఇలా రాసుకొచ్చారు. 400 ఏళ్ల క్రితం ఇండియాలో టమాట పంట లేదు. జైనులు తమ వంటల్లో ఇప్పటికీ ఉల్లి పాయలు వాడరు. ఉల్లి, టమాట విషయంలో ధరల TOMOTA{#}Mirchi;Onion;Ancestral;Corporate;Madanapalliటమాటా రేటు వెనుక రైతుల చేదు నిజాలు ఇవే?టమాటా రేటు వెనుక రైతుల చేదు నిజాలు ఇవే?TOMOTA{#}Mirchi;Onion;Ancestral;Corporate;MadanapalliSun, 16 Jul 2023 10:08:00 GMTరైతులు ఎన్ని రోజులు నష్టపోయినా కూడా ఏ రోజు ఒక్కరు అన్నదాత గురించి పోస్టులు పెట్టరు. కానీ ఉల్లిపాయ రేటు పెరిగిందని టమాట ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, పచ్చి మిర్చి కొనలేకపోతున్నామని సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వాడుతుంటారు. ట్రోల్స్ చేస్తుంటారు. ఇలా ఇష్టారీతిన ప్రవర్తిస్తుంటారు. అయితే ధరల పెరుగుదల ఇండియాలో పంటల అంశంపై అమరనాథ్ వాసిరెడ్డి అనే సామాజిక విశ్లేషకులు పోస్టు లో ఇలా రాసుకొచ్చారు.  


400 ఏళ్ల క్రితం ఇండియాలో టమాట పంట లేదు. జైనులు తమ వంటల్లో ఇప్పటికీ ఉల్లి పాయలు వాడరు. ఉల్లి, టమాట విషయంలో ధరల ఒడిదొడుకులు ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. మదనపల్లి మార్కెట్ లో కిలో టమాట రూపాయి పలకకుండా ఉన్నప్పుడు వాటిని రోడ్లపై రైతన్న పారేశాడు. అప్పుడు ఇంత ఫోకస్ ఎవరూ చేయలేదు. టమాట ఉత్పత్తి తగ్గి పోయింది. దీంతో డిమాండ్ పెరిగి రేట్ పెరిగింది. టమాట ధర ఎక్కువగా ఉంది.


కొన్ని రోజలు పాటు టమాట లేకుండా వంటలు చేసుకోవచ్చు. మన పూర్వీకులు లక్షల ఏళ్ల పాటు టమాట లేకుండానే వంట చేసుకుని తినేవారు. ఈ టమాట ధర రూ.5 రూపాయలు, రూ.10కి పడిపోయినపుడు టమాట రైస్, టమాట జ్యూస్, టమాట కర్రీ అంటూ ఏవేవో చేసుకుని టమాట ఫెస్టి వల్ జరుపుకోవచ్చు.


ఎకరం పొలంలో 10 వేల కిలోల టమాలు పండించొచ్చు. కానీ కార్పొరేట్ చేతిలోకి వ్యవసాయం వెళ్లిపోతే రాబోయే రోజుల్లో ప్రతి రేటు ఇలాగే పెరుగుతుంది. అప్పుడు వ్యవసాయం చేసే వారు ఉండరు. దీంతో ప్రతిదీ సమస్యగా మారిపోతుంది. రోజు రెండు పూటల అన్నం తినాలంటే కచ్చితంగా రెండు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. మరీ ఇంతటి కష్టమైన జీవితం గడపకుండా ఉండాలంటే రైతులకు మరింత ప్రోత్సహాకాలిచ్చి వారి చేత పంటలు పండించేలా చేయాలి. రైతు జీవితం బాగుంటేనే సమాజంలో అందరికీ అన్నం దొరుకుతుంది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>