PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-tanuku-volunteerseb2821f6-da5e-44af-8335-3cb88d51864d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-tanuku-volunteerseb2821f6-da5e-44af-8335-3cb88d51864d-415x250-IndiaHerald.jpgనిజానికి ఇది పవన్ కు వర్తించదు. ఎందుకంటే పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందుకనే అంబటి జనసేనానిని ఏకపత్నీవ్రతుడదని అంటామని చెప్పింది. ఇదికూడా పవన్ను మండించేదే అనటంలో సందేమంలేదు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అన్నపుడల్లా పవన్ రెచ్చిపోతున్నారు. మరి ఏపత్నీవ్రతుడని అన్నపుడు ఎలా రియాక్టవుతారో చూడాలి. ఇదే సమయంలో పబ్లిక్ మీటింగుల్లో పవన్ను పట్టుకుని జగన్ దత్తపుత్రుడని పదేపదే అంటున్నారు. దానికి పవన్ కూడా సీబీఐ దత్తపుత్రుడని అన్నా జనాల్లోకి సరిగా వెళ్ళలేదు. janasena pawan tanuku volunteers{#}Pawan Kalyan;Jagan;Hanu Raghavapudi;CBI;YCP;Yatraఅమరావతి : వైసీపీ పవన్ను దారుణంగా ర్యాగింగ్ చేస్తోందా ?అమరావతి : వైసీపీ పవన్ను దారుణంగా ర్యాగింగ్ చేస్తోందా ?janasena pawan tanuku volunteers{#}Pawan Kalyan;Jagan;Hanu Raghavapudi;CBI;YCP;YatraSun, 16 Jul 2023 09:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనవరంగా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేస్తున్నారు. జగన్ అంటే ద్వేషం వల్ల 24 గంటలూ 365 రోజులు పవన్ విషం చిమ్మేస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా పవన్ నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. వారాహియాత్ర ముందువరకు ఇలాగే సాగిన వ్యవహారం యాత్ర మొదలైన తర్వాత మరింత ఎక్కువైపోయింది. అందుకనే మంత్రులు,  వైసీపీ నేతలు కూడా అంతేస్ధాయిలో పవన్ను ర్యాగింగ్ చేస్తున్నారు.





మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతు ఇకనుండి తాము పవన్ను ఏకపత్నీవ్రతుడని సంబోధిస్తామని చెప్పారు. జగన్ను తాను ఇక నుండి జగ్గూబాయ్ అని పిలుస్తానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకనే దానికి విరుగుడుగా అంబటి మాట్లాడుతు పవన్ను ఇకనుండి ఏకపత్నీవ్రతుడని పిలుస్తామన్నారు. ఏకపత్నీవ్రతుడంటే అందరికీ తెలిసిందే. ఒక వివాహం చేసుకున్న వాళ్ళని ఏకపత్నీవ్రతుడని అంటారు.





నిజానికి ఇది పవన్ కు వర్తించదు. ఎందుకంటే పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందుకనే అంబటి జనసేనానిని ఏకపత్నీవ్రతుడదని అంటామని చెప్పింది. ఇదికూడా పవన్ను మండించేదే అనటంలో సందేమంలేదు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అన్నపుడల్లా పవన్ రెచ్చిపోతున్నారు. మరి ఏపత్నీవ్రతుడని అన్నపుడు ఎలా రియాక్టవుతారో చూడాలి. ఇదే సమయంలో పబ్లిక్ మీటింగుల్లో పవన్ను పట్టుకుని జగన్ దత్తపుత్రుడని పదేపదే అంటున్నారు. దానికి పవన్ కూడా సీబీఐ దత్తపుత్రుడని అన్నా జనాల్లోకి సరిగా వెళ్ళలేదు.





అంటే పవన్ను దత్తపుత్రుడని, మూడు పెళ్ళిళ్ళని, ఏకపత్నీవ్రతుడని, ప్యాకేజీస్టార్ అని చెప్పి పదేపదే ర్యాగింగ్ చేస్తోంది. ఇదంతా ఎందుకొచ్చిందంటే పవన్ తప్పుల వల్లే అన్నది వాస్తవం. జగన్ అంటే నిలువెల్లా ద్వేషం నింపుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టిందే పవన్. దీనికి కారణం ఏమిటంటే పవన్ను రాజకీయ నేతగాను, జనసేనను పార్టీగాను జగన్ అసలు లెక్కేచేయటంలేదు. దీనికి అదనంగా 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోవటంతో మంట ఇంకా ఎక్కువైపోయింది. అప్పటినుండి జగన్ అంటేనే పవన్ కసి, ద్వేషంతో ఊగిపోతున్నారు. దాని పర్యవసానమే వ్యక్తిగత దూషణలు.




RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>