MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer16f20311-8cc4-4c35-ac05-ae4fcb72f6e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer16f20311-8cc4-4c35-ac05-ae4fcb72f6e2-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ మన ముందుకి రాబోతున్నారు.. ఇక థియేటర్లు ఖచ్చితంగా దద్దరిల్లిపోవడం అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈసారి ఖచ్చితంగా ఆయన అభిమానులకు కిక్ వస్తుందట. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కు దేశావ్యాప్తంగా మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది.ఆయన సినిమా వస్తుందంటే చాలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య సూపర్ స్టార్ చిత్రాలు మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి.దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది.ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్ నటిస్తున్న 'జైలర్‌'JAILER{#}Cinema Tickets;Kick;tamannaah bhatia;ravi anchor;Kannada;Rajani kanth;Director;Cinemaజైలర్: బజ్ కోసం ఆడియన్స్ కి బంపర్ ఆఫర్?జైలర్: బజ్ కోసం ఆడియన్స్ కి బంపర్ ఆఫర్?JAILER{#}Cinema Tickets;Kick;tamannaah bhatia;ravi anchor;Kannada;Rajani kanth;Director;CinemaSun, 16 Jul 2023 15:31:00 GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ మన ముందుకి రాబోతున్నారు.. ఇక థియేటర్లు ఖచ్చితంగా దద్దరిల్లిపోవడం  అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈసారి ఖచ్చితంగా ఆయన అభిమానులకు కిక్ వస్తుందట. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కు దేశావ్యాప్తంగా  మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది.ఆయన సినిమా వస్తుందంటే చాలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య సూపర్ స్టార్ చిత్రాలు మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి.దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది.ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్ నటిస్తున్న 'జైలర్‌' సినిమాకి బిజినెస్ పెద్దగా జరగలేదనే మాట కూడా వినిపిస్తోంది. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, తమన్నా, రమ్యకష్ణ, యోగిబాబు ఇంకా వసంత రవి లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తుండగా, సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీగా నిర్మిస్తోంది.


ఇక షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలని జరుపుకొంటోంది. ఆగస్టు 10 వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ ముత్తువేల్‌ పాండియన్‌ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ గెటప్‌, టైటిల్‌ లాంటివి రిలీజ్‌ చేసినా కూడా  ఆశించిన మూమెంట్‌ రాలేదు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రచారం అస్త్రాలు ప్రయోగించడానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా జైలర్ నుంచి 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాని ఈ పాట షేక్ చేస్తుంది. తమన్నా అందాలారబోత ఇంకా అనిరుధ్‌ బీట్స్ దెబ్బకు ఈ పాట బాగా వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా పై బజ్ పెంచడానికి మూవీ టీం ఓ ప్లాన్ ఏసింది. అదేంటంటే కావాలయ్య పాట రీల్ చేసి తమని మెప్పించినవారికి మూవీ టీం ఫ్రీగా USA షో టికెట్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంకా అలాగే ఈ స్పీడ్ లో హుకుమ్‌ టైగర్‌ కా హుకుమ్‌ అనే మరో మాస్‌ పాటను విడుదల చేయబోతున్నారు. జూలై 17న రిలీజ్ చేయనున్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఫొటోతో పోస్టర్‌ను విడుదల చేశారు.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>