Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c3704653-ea01-4cf9-bc2f-8d7cafcd6dc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c3704653-ea01-4cf9-bc2f-8d7cafcd6dc1-415x250-IndiaHerald.jpgథాయ్‌లాండ్, నెదర్లాండ్స్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డు క్రియేట్ అయింది. తిపట్చా పుట్టావాంగ్ (Thipatcha Putthawong) అనే థాయ్‌లాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించింది. ఆమె తీసిన కీలక వికెట్ల వల్ల మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టును థాయ్‌లాండ్ సులభంగా ఓడించగలిగింది. టీ20 మ్యాచ్‌లో 4 బంతులకు వరుసగా నలుగురు ప్లేయర్లను ఔట్ చేయడం చాలా అరుదు. ఈ ఘనత క్రికెట్ చరిత్రలో చాలా తక్కువ మంది మాత్రమే సాధించగCricket {#}Netherlands;Jason Holder;ICC T20;Cricket;gold;Scotland4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి.. టీ20 క్రికెట్‌లో సంచలనం?4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి.. టీ20 క్రికెట్‌లో సంచలనం?Cricket {#}Netherlands;Jason Holder;ICC T20;Cricket;gold;ScotlandSun, 16 Jul 2023 18:00:00 GMTథాయ్‌లాండ్, నెదర్లాండ్స్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డు క్రియేట్ అయింది. తిపట్చా పుట్టావాంగ్ (Thipatcha Putthawong) అనే థాయ్‌లాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించింది. ఆమె తీసిన కీలక వికెట్ల వల్ల మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టును థాయ్‌లాండ్ సులభంగా ఓడించగలిగింది.

టీ20 మ్యాచ్‌లో 4 బంతులకు వరుసగా నలుగురు ప్లేయర్లను ఔట్ చేయడం చాలా అరుదు. ఈ ఘనత క్రికెట్ చరిత్రలో చాలా తక్కువ మంది మాత్రమే సాధించగలిగారు. ఇప్పటిదాకా ఈ రికార్డును ఛేదించిన వారిలో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో తిపట్చా ఏడవ క్రికెటర్‌గా నిలిచింది. ఆమె రీసెంట్‌గా జరిగిన టీ20 మ్యాచ్ లో 3.5 ఓవర్లలో 8 పరుగులకే 5 వికెట్లు తీసింది. ఆమె బౌలింగ్ వల్ల నెదర్లాండ్స్ మహిళల జట్టు 75 పరుగులకే ఆలౌటైంది.

టాలెంటెడ్ లేడీ స్పిన్నర్ తిపట్చా ప్రత్యర్థి జట్టులోని ఫెబ్ మోల్కెన్‌బోర్, మిక్కీ జ్విల్లింగ్, హన్నా లంధీర్, కరోలిన్ డి లాంగే అనే నలుగురు ప్లేయర్ల వికెట్లు తీసింది. మ్యాచ్ 18వ ఓవర్లో ఆమెకు ఈ వికెట్లు దక్కాయి. కొన్ని వికెట్లు మాత్రమే కోల్పోవడంతో, థాయ్‌లాండ్ 13.3 ఓవర్లలో మొత్తం స్కోరును సులభంగా ఛేదించింది. T20I ట్రై-సిరీస్‌ను గెలుచుకుంది, ఈ టోర్నమెంట్‌లో స్కాట్లాండ్ మహిళల జట్టు కూడా పాల్గొన్నది.

కేవలం 19 ఏళ్ల వయసున్న తిపట్చా చాలా ప్రతిభగల లేడీ క్రికెటర్. ఈమె కంబోడియాలో జరిగిన సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో థాయ్‌లాండ్‌కు బంగారు పతకం సాధించడంలో సహకరించింది. అద్భుతమైన ప్రదర్శన కారణంగా మే 2023లో ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కూడా ఎంపికైంది.

గతంలో వివిధ దేశాలకు చెందిన మరో ముగ్గురు మహిళా క్రీడాకారులు కూడా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టారు. పురుషుల క్రికెట్‌లో, రషీద్ ఖాన్, లసిత్ మలింగ, కర్టిస్ కాంఫర్, జాసన్ హోల్డర్ వంటి కొంతమంది ఆటగాళ్లు కూడా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అదే ఫీట్ సాధించారు.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>