PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-jagan-volunteers968c7123-ea45-4b49-aebd-b14293411fa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-jagan-volunteers968c7123-ea45-4b49-aebd-b14293411fa4-415x250-IndiaHerald.jpgవీళ్ళిద్దరు పదేపదే ఎందుకింతగా వాలంటీర్లపై నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ? ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళవల్ల తమకు బాగా నష్టం జరుగుతుందని వీళ్ళిద్దరు భయపడుతున్నారు కాబట్టే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలు జనాల్లో బలంగా పాతుకుపోయాయి. జనాలకు కావాల్సిన పనులను, సర్టిఫికేట్లు తదితరాలను గ్రామ, వార్డు సచివాలయాల నుండి వాలంటీర్లు రోజుల్లోనే తీసుకొచ్చి ఇస్తున్నారు.chandrababu pawan jagan volunteers{#}Yevaru;Letter;CBN;Party;Janasenaఅమరావతి : వాలంటీర్లంటే వీళ్ళిద్దరు వణికిపోతున్నారా ?అమరావతి : వాలంటీర్లంటే వీళ్ళిద్దరు వణికిపోతున్నారా ?chandrababu pawan jagan volunteers{#}Yevaru;Letter;CBN;Party;JanasenaSun, 16 Jul 2023 03:00:00 GMT



ఇపుడిదే విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. వారాహియాత్రలో జనసేన అధినేత వపన్ కల్యాణ్ పదేపదే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధలపై ఆరోపణలు చేస్తున్నారు. ఇష్టానుసారం నోరుపారేసుకుంటున్నారు. దాంతో వాలంటీర్లంతా రోడ్లపైకి చేరి నిరసనలు తెలుపుతున్నారు. మొదటి మూడురోజులు పవన్ కు మద్దతుగా లేకపోతే వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు చంద్రబాబు భయపడిపోయారు. అలాంటిది ఇపుడు చంద్రబాబు కూడా వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.





వీళ్ళిద్దరు పదేపదే ఎందుకింతగా వాలంటీర్లపై నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ? ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళవల్ల తమకు బాగా నష్టం జరుగుతుందని వీళ్ళిద్దరు భయపడుతున్నారు కాబట్టే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలు జనాల్లో బలంగా పాతుకుపోయాయి. జనాలకు కావాల్సిన పనులను, సర్టిఫికేట్లు తదితరాలను గ్రామ, వార్డు సచివాలయాల నుండి వాలంటీర్లు రోజుల్లోనే తీసుకొచ్చి ఇస్తున్నారు.





ఒకపుడు ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరగలేక నానా అవస్తలు పడిన జనాలకు సచివాలయాలు, వాలంటీర్ల సాయం వల్ల హ్యాపీగా ఫీలవుతున్నారు. దాంతో వాలంటీర్లంతా వచ్చేఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని, ఓట్లేయిస్తారనే అనుమానంతో కూడిన భయం మొదలైంది. అందుకనే ఎన్నికల విధల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ, జనసేనలు ఎన్నికల కమీషన్ కు లేఖలు రాస్తున్నది. అంటే చంద్రబాబు, పవన్  వాలంటీర్లను చూసి ఎంతగా వణికిపోతున్నారో అర్ధమవుతోంది.





ఈ వ్యవస్ధ గురించి కతలు చెబుతున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు జన్మభూమి అనే వ్యవస్ధను ఏర్పాటుచేశారు. అయితే జన్మభూమి వ్యవస్ధ మామూలు జనాలనే కాకుండా చివరకు పార్టీ నేతలను కూడా పట్టి పీడించేసింది. అందులోని సభ్యులు జనాలను జలగల్లాగ డబ్బుల కోసం పట్టి పీడించేశారు. దాంతో మామూలు జనాలతో పాటు పార్టీ నేతలు, క్యాడర్ కూడా చంద్రబాబుకు ఎదురుతిరిగటంతో టీడీపీకి 2019లో ఘోరఓటమి తప్పలేదు. కానీ వాలంటీర్లు అలా చేయటంలేదు. ప్రజలకు అందాల్సిన సేవలతో పాటు సర్వీసును కూడా చక్కగా అందిస్తున్నారు. అందుకనే జనాలు కూడా సానుకూలంగా ఉన్నారు. అందుకనే వాలంటీర్, సచివాలయ వ్యవస్ధంటే వీళ్ళిద్దరు మండిపోతున్నారు, వణికిపోతున్నారు.  




RRR Telugu Movie Review Rating

"రూల్స్ రంజన్" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>