Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle260df798-c45d-411b-9e79-ca73ad3f5da6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle260df798-c45d-411b-9e79-ca73ad3f5da6-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో ఒక్కొక్కరికి ఒక్క నమ్మకం ఉంటుంది కొంతమంది హిట్ సెంటిమెంట్ గా వాళ్ల సినిమాల్లో హీరోయిన్స్ ని కా, ఆర్టిస్ట్ లను కానీ,మ్యూజిక్ డైరెక్టర్స్ ని కానీ రిపీట్ చేస్తూ ఉంటారు.అయితే ప్రస్తుతం ఎన్టీయార్ కూడా ఓ లక్కీ సెంటిమెంట్ నమ్ముతున్నారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి .అదేంటంటే ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తే ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. ఈ సెంటిమెంట్ ఒకటో, రెండో కాదు ఏకంగా ఐదు సార్లు రిపీట్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో బృందsocialstars lifestyle{#}munna producer;vamsi paidipally;Gabbar Singh;Jai Lavakusa;Brindavanam;trivikram srinivas;Prabhas;kalyan;sukumar;koratala siva;NTR;Heroine;Hero;Industry;Cinema;Blockbuster hit;Directorఎన్టీఆర్ కు ఉన్న ఆ సెంటిమెంట్ కొరటాల శివకు కలిసోచ్చేనా....!!ఎన్టీఆర్ కు ఉన్న ఆ సెంటిమెంట్ కొరటాల శివకు కలిసోచ్చేనా....!!socialstars lifestyle{#}munna producer;vamsi paidipally;Gabbar Singh;Jai Lavakusa;Brindavanam;trivikram srinivas;Prabhas;kalyan;sukumar;koratala siva;NTR;Heroine;Hero;Industry;Cinema;Blockbuster hit;DirectorSun, 16 Jul 2023 16:40:23 GMTసినిమా ఇండస్ట్రీ లో ఒక్కొక్కరికి ఒక్క నమ్మకం ఉంటుంది కొంతమంది హిట్ సెంటిమెంట్ గా వాళ్ల సినిమాల్లో హీరోయిన్స్ ని కా, ఆర్టిస్ట్ లను కానీ,మ్యూజిక్ డైరెక్టర్స్ ని కానీ రిపీట్ చేస్తూ ఉంటారు.అయితే ప్రస్తుతం ఎన్టీయార్ కూడా ఓ లక్కీ సెంటిమెంట్ నమ్ముతున్నారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి .అదేంటంటే ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తే ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. ఈ సెంటిమెంట్ ఒకటో, రెండో కాదు ఏకంగా ఐదు సార్లు రిపీట్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో బృందావనం ఒకటి. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈయనకు ఇది రెండో సినిమా.

మొదట ప్రభాస్ తో మున్నా సినిమా చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో రెండేళ్లు వంశీ పైడిపల్లి వైపు ఎవరూ చూడలేదు. అయితే ఎన్టీఆర్ వంశీని నమ్మి ఛాన్స్ ఇవ్వగా వీరి కాంబోలో వచ్చిన బృందావనం ఘన విజయం సాధించింది. అలాగే బిజినెస్ మేన్ తర్వాత దాదాపు నాలుగేళ్ల వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన పూరీ జగన్నాథ్ ను నమ్మి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చాడు. అలా ఎన్టీఆర్ హీరోగా పూరీ తెరకెక్కించిన టెంపర్‌ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మహేష్ బాబుతో 1 - నేనొక్కడినే వంటి డిజాస్టర్ మూవీని తీసి విమర్శల పాలైన సుకుమార్ తో ఎన్టీఆర్ `నాన్నకు ప్రేమతో` చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో సుకుమారుడు మళ్లీ పూర్వవైభవం అందుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన తర్వాత డైరెక్టర్ బాబీ వొంక ఒక్క హీరో కూడా కన్నెత్తి చూడలేదు. అప్పుడు కూడా బాబీని నమ్మి ఎన్టీఆరే ఛాన్స్ ఇచ్చాడు. వీరి కలయికలో వచ్చిన జై లవకుశ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ ను మూటగట్టుకున్న త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ `అరవింద సమేత వీర రాఘవ` చేశాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్టే అయింది. ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర విషయంలోనూ రిపీట్ అవ్వాలని ఆశపడుతున్నారు. ఆచార్యతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కొరటాల శివ దేవర మూవీని తెరకెక్కిస్తున్నారు. మరి ఎన్టీఆర్ లక్కీ సెంటిమెంట్ దేవరకు కూడా కలిసి వస్తుందా ఒకవేళ అలా వస్తె ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టడం పక్క అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>