Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith893d8f7d-67b4-4ab0-a0cf-4d46f9ce9cce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith893d8f7d-67b4-4ab0-a0cf-4d46f9ce9cce-415x250-IndiaHerald.jpgసాధారణంగా టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అధికారం కేవలం కెప్టెన్ కి మాత్రమే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా జట్లకు సారదులుగా ఉన్న ఆటగాళ్లు ఎప్పుడు చెబితే అప్పుడే మ్యాచ్ ని డిక్లేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇలా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే విషయంలో ఆయా జట్ల కెప్టెన్లు తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న యాషెష్ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ త్వరగా డిక్లేరRohith{#}VIRAT KOHLI;Rohit Sharma;Ishan Kishan;England;West Indies;Ben Stokes;Parugu;Indiaసడన్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ పై.. క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ?సడన్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ పై.. క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ?Rohith{#}VIRAT KOHLI;Rohit Sharma;Ishan Kishan;England;West Indies;Ben Stokes;Parugu;IndiaSun, 16 Jul 2023 11:50:00 GMTసాధారణంగా టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అధికారం కేవలం కెప్టెన్ కి మాత్రమే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా జట్లకు సారదులుగా ఉన్న ఆటగాళ్లు  ఎప్పుడు చెబితే అప్పుడే మ్యాచ్ ని డిక్లేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇలా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే విషయంలో ఆయా జట్ల కెప్టెన్లు తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న యాషెష్ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ త్వరగా డిక్లేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో మంది ఇదే విషయం గురించి చర్చించుకున్నారు.


 అయితే ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్ మొదటి టెస్టులో ఇలా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సమయంలో కూడా అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఇషాన్ కిషన్ నెమ్మదిగా బంతులను ఎదుర్కొంటూ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సడన్గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంతో అటు ఇషాన్ కిషన్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు అని చెప్పాలి. ఈ విషయంపై కొంతమంది విమర్శలు కూడా చేశారు. కాగా సడన్గా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గురించి రోహిత్ శర్మ ఇటీవల స్పందించాడు.



 అంతేకాదు తాను ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి వెనుక కారణం ఏంటి అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అవుట్ కాగానే ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేద్దాం అని అనుకున్నాను. కానీ ఇక ఇషాన్ కిషన్ తొలి టెస్ట్ లో తన పరుగుల ఖాతా తెరిచిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అందుకే ఇషాన్ కిషన్ ఒక పరుగు చేయగానే ఇక ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాను అంటు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 20 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. ఇక అటు వెంటనే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం లో మునిగిపోయారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>