Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakc8b9a681-bda1-4c91-a0e8-5f0191d07e73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakc8b9a681-bda1-4c91-a0e8-5f0191d07e73-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ లో ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే, క్రికెట్ అంటే ఇష్టముండని వారు కూడా కచ్చితంగా చూస్తారు. అంతలా ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఆడవారికే కాదు చూసేవారికి కూడా టెన్షన్ ఉంటుంది. తాజాగా జరిగిన T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ముందు పాకిస్థాన్ గెలుస్తుందని అనుకున్నా చివరకి కోహ్లీ అద్భుతమైన బ్యPak{#}ICC T20;Chaitanya;Pakistan;Cricket;VIRAT KOHLI;Indiaపాకిస్థాన్ క్రికెటర్.. ఇలా అన్నాడేంటి?పాకిస్థాన్ క్రికెటర్.. ఇలా అన్నాడేంటి?Pak{#}ICC T20;Chaitanya;Pakistan;Cricket;VIRAT KOHLI;IndiaSun, 16 Jul 2023 15:00:00 GMTపాకిస్థాన్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ లో ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే, క్రికెట్ అంటే ఇష్టముండని వారు కూడా కచ్చితంగా చూస్తారు. అంతలా ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఆడవారికే కాదు చూసేవారికి కూడా టెన్షన్ ఉంటుంది. తాజాగా జరిగిన t20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ముందు పాకిస్థాన్ గెలుస్తుందని అనుకున్నా చివరకి కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ ని గెలిపించాడు. ఇలా ఎన్ని సార్లు జరిగినా భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బయట ఎన్ని గొడవలున్నా క్రికెట్ లో మాత్రం రెండు జట్లు చాలా స్పోర్టివ్ గా ఉంటాయి. తాజాగా పాకిస్థాన్ ప్లేయర్ ఇదే విషయాలపై మాట్లాడాడు.

ఒకప్పుడు పాకిస్థాన్, బాంగ్లాదేశ్ కూడా మన దేశంలో భాగమే. అయితే స్వాతంత్రం వచ్చాక ఈ పాకిస్థాన్ - ఇండియా శత్రువులుగా మారాయి. అయితే ఎంత శత్రుత్వం ఉన్నా ఈ రెండు టీంలు క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ కొన్ని సంవత్సరాలు వినోదాన్ని పంచాయి. కొన్నేళ్లుగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడడం మానేశాయి. కానీ ఈ రెండు టీంలు మ్యాచ్ లు ఎప్పుడు జరుగుతాయా అని అందరు ఎదురుచూస్తుంటారు.  షాదాబ్ ఖాన్ ప్రస్తుతం మేజర్ క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు. శాన్ ఫ్రాన్సికో యూనికార్న్స్‌ టీమ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న షాదాబ్.. టీమిండియా క్రికెటర్లు తజిందర్ సింగ్, చైతన్య భిష్ణోయ్‌లతో కలిసి ఆడుతున్నాడు. ఈ సందర్భంగా షాదాబ్ ఖాన్ మాట్లాడాడు. 1947 కి మనమంతా ఒక్కటే కదా. భారత సోదరులతో కలిసి ట్రైనింగ్ తీసుకోవడం చాల ఆనందంగా ఉంది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ఏమయినా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి ఇదే చక్కని అవకాశం. ఒకప్పుడు ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు. మన భాషలు, సంస్కృతులు అంతా ఒక్కటే. పంజాబీలో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. హిందీలో టీమిండియా ప్లేయర్లతో మాట్లాడుతుంటే అన్నాదమ్ములతో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది అంటూ షాదాబ్ కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ కామెంట్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ బాక్స్ లో తెలపండి.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>