Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8fedf56a-d943-4519-8483-34956c8537c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8fedf56a-d943-4519-8483-34956c8537c6-415x250-IndiaHerald.jpgకెరీర్‌లో ఒకటి లేదా రెండో ఇండస్ట్రీ హిట్లు ఉంటే.. స్టార్ డైరెక్టర్‌ అంటారు. అవే చేసినవన్నీ ఇండస్ట్రీ హిట్, బ్లాక్‌ బస్టర్లు హిట్ అయితే ఆయన్నే దర్శకధీరుడు రాజమౌళి అని అంటారు.'స్టూడెంట్‌ నెం.1'తో టాలీవుడ్ డైరెక్టర్ గా మారిన జక్కన.. 'సింహాద్రి', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచ సినీ చరిత్రలో చెరిగిపోని ముద్రవేశారు. అయితే ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఒక చిత్రం మాత్రం కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. ఇంకా చెప్పాలంటే కాస్త నష్టాన్ని కూడా తెచ్చిందట.socialstars lifestyle{#}Rajamouli;Kanna Lakshminarayana;Oscar;Chitram;Rajani kanth;Writer;prasad;March;Journey;Director;Industry;Hollywood;Indian;Tollywood;Success;Cinemaరాజమౌళి సినిమాల్లో బిగ్ హిట్ అందుకోలేకపోయినా సినిమా...!!రాజమౌళి సినిమాల్లో బిగ్ హిట్ అందుకోలేకపోయినా సినిమా...!!socialstars lifestyle{#}Rajamouli;Kanna Lakshminarayana;Oscar;Chitram;Rajani kanth;Writer;prasad;March;Journey;Director;Industry;Hollywood;Indian;Tollywood;Success;CinemaSun, 16 Jul 2023 08:40:23 GMTకెరీర్‌లో ఒకటి లేదా రెండో ఇండస్ట్రీ హిట్లు ఉంటే.. స్టార్ డైరెక్టర్‌ అంటారు. అవే చేసినవన్నీ ఇండస్ట్రీ హిట్, బ్లాక్‌ బస్టర్లు హిట్ అయితే ఆయన్నే దర్శకధీరుడు రాజమౌళి అని అంటారు.'స్టూడెంట్‌ నెం.1'తో టాలీవుడ్ డైరెక్టర్ గా మారిన జక్కన.. 'సింహాద్రి', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచ సినీ చరిత్రలో చెరిగిపోని ముద్రవేశారు. అయితే ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఒక చిత్రం మాత్రం కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. ఇంకా చెప్పాలంటే కాస్త నష్టాన్ని కూడా తెచ్చిందట. వివరాళ్లోకి వెళితే..సక్సెస్ పుల్ కు కేరాఫ్ అడ్రెస్..: పనిలో ఆయన్ను పర్‌ఫెక్షనిస్ట్‌ అంటారు. అందుకే ఆయన ఎలాంటి కథను సినిమాగా తీసినా అది బ్లాక్ బాస్టర్ హిట్ లేదా సూపర్‌ హిట్‌ లేదా ఇండస్ట్రీ హిట్. ఆయనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్‌. ఎస్‌. రాజమౌళి. సెన్సేషన్‌, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకుని కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ బయటకు తీస్తే అందులో మొదటి పేరు ఆయనదే.

సినీ ప్రయాణం ఇలా మొదలు..: రాజమౌళి సినీ జర్నీ ఎలా ప్రారంభమైందో.. ఎక్కడ నుంచి షురూ అయిందో సినీ ప్రియులందరికీ తెలిసిన విషయమే. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తనయుడైన ఆయన.. సీరియల్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 2001లో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1' తో దర్శకుడిగా మారారు. అలా తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ ను అందుకున్నారు. అలా ఈ చిత్రంతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.

ఆస్కార్ తెచ్చిన ఘనత...: ఆ తర్వాత ఇప్పటివరకు రెండున్నర దశాబ్దాల తన సినీ కెరీర్ లో.. మొత్తం 12 చిత్రాలను తీశారు. ఈ చిత్రాలన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి భారీ విజయాన్ని అందుకున్నాయి. అసలు ఫ్లాప్ అన్న పదమే ఆయన హిస్టరీలో లేదు. అదీ ఆయన రేంజ్. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలకు మార్చి వారికి స్టార్ స్టేటస్ ను అందించారు. అలాగే దేశానికి ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా అందించారు. 'ఆర్ఆర్ఆర్‌' చిత్రంతో వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఆస్కార్ ఘనతను అందుకున్నారు.

ఆ ఒక్క సినిమా మాత్రమే..: అయితే ఆయన తీసిన చిత్రాలన్నీ నిర్మాతలకు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టాయి. పెట్టిన బడ్జెట్ కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ వసూళ్లనే సాధిస్తుంటాయి. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కడతారు. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఓ చిత్రం మాత్రం కమర్షియల్ గా బిగ్ హిట్ అందుకోలేకపోయిందట. ఆయన కెరీర్ లో అదొక్కటే చిన్న మచ్చ. అదేంటంటే.. 2004 సెప్టెంబరు 23న రిలీజైన 'సై' చిత్రం. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా కథ పరంగా సినీ ప్రేమికుల్ని బాగానే ఆకట్టుకుంది. దాదాపు రూ. 8 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారట. కానీ ఇది లాంగ్ రన్ లో కేవలం రూ. 12 కోట్లు మాత్రమే వసూలు చేసిందట. అంటే కమర్షియల్ గా చిత్రం హిట్టే కానీ.. కొన్ని ఏరాయాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్ లకు ఆశించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టలేదట. చిన్నపాటి నష్టాలు తెచ్చాయని బయట కథనాలు ఉన్నాయి.

భారీ అడ్వెంచర్ మూవీ..: ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా ఏంటంటే.. ఓ భారీ అడ్వెంచర్ మూవీ. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఈ చిత్రం చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఇది రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా కోసం త్వరలోనే ట్రైనింగ్ సెషన్ కూడా ప్రారంభంకానుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హాలీవుడ్ రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>