Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/anil5f6f6502-fb2a-4a3e-a70a-fb6a516a0a17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/anil5f6f6502-fb2a-4a3e-a70a-fb6a516a0a17-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే అతని కెప్టెన్సీ లో ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియా మంచి ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ ఆటగాడిగా వ్యక్తిగత ప్రదర్శన విషయంలో మాత్రం విఫలమవుతూ ఉండడం గమనార్హం. ఎందుకంటే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక.. ఒకరకంగా వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా అతను జట్టుకు భారంగానే మారిపోయాడు. ముఖ్యంగా కీలకమైన సమయంలో చేతులెత్తేసి ఇక టీమిండియా ఓటమిలో అతను కూడా ఒక కారణంగAnil{#}anil music;VIRAT KOHLI;Rohit Sharma;West Indies;Chequeరోహిత్ సెంచరీపై.. అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్?రోహిత్ సెంచరీపై.. అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Anil{#}anil music;VIRAT KOHLI;Rohit Sharma;West Indies;ChequeSun, 16 Jul 2023 12:00:00 GMTవిరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే అతని కెప్టెన్సీ లో ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియా మంచి ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే విజయవంతం గా ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ ఆటగాడిగా వ్యక్తిగత ప్రదర్శన విషయంలో మాత్రం విఫలమవుతూ ఉండడం గమనార్హం. ఎందుకంటే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక.. ఒకరకంగా వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా అతను జట్టుకు భారం గానే మారి పోయాడు.


 ముఖ్యంగా కీలకమైన సమయంలో చేతులెత్తేసి ఇక టీమిండియా ఓటమిలో అతను కూడా ఒక కారణంగా మారిపోయాడు అని చెప్పాలి. అయితే కెప్టెన్ కావడంతో అతనిపై వేటు వేయకుండా ఊరుకున్నారు సెలెక్టర్లు. కాగా అతని ఆట తీరుపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎంతోమంది  మాజీ ఆటగాళ్ళు. అయితే ఇక ఇలాంటి విమర్శల నడుమ ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ శర్మ మరోసారి తన బ్యాట్ తో మెరిసాడు. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ తన వైఫల్యాలకు చెక్ పెట్టేసాడు అంటూ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.



 ఇక ఇదే విషయం గురించి టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ రోహిత్ పై ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ చాలా ఓపికగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎంతో బాగా ఆడాడు. ఈ సెంచరీ అతనికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రమే కాదు డబ్ల్యూటీసి ఫైనల్ ఐపీఎల్ లో కూడా అతను బాగానే ఆడాడు. కానీ ఫామ్ లో లేడు అనడం సరికాదు. దూకుడుగా ఆడే క్రమంలో విఫలం అయ్యాడు. కానీ అతనిది పూర్ ఫామ్ అనడం మాత్రం సరికాదు అంటూ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>