LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hormones-uses65547525-ba54-4cae-8603-0d04d4b04812-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hormones-uses65547525-ba54-4cae-8603-0d04d4b04812-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చాలామంది డబ్బు,హోదా ఉన్నా సరే మానసిక ప్రశాంతత లేక సతమతమవుతూ ఉన్నారు.ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా దీర్ఘంగా ఆలోచిస్తూ వారి ఆరోగ్యాన్ని వారే దెబ్బతీసుకుంటూ ఉన్నారు.దానికి కారణం కొన్ని రకాల హార్మోన్లు తగ్గుదలేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.కొన్ని రకాల హార్మోన్ల వల్ల మనకు మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా మనం సంతోషంగా జీవించడానికి కూడా ఉపయోగపడతాయి.సంతోషం సగం బలం అని ఊరికే అన్నారా పెద్దలు.సంతోషంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడామెరుగ్గా ఉంటుంది.మరి ఆ హార్మోన్లు ఏంటో,అవి ఎలా ఉత్పత్తి అవుతాయో మనమHORMONES;USES{#}chocolate;Manamఈ హార్మోన్లతో మానసిక ప్రశాంతత కలుగుతుందని మీకు తెలుసా..?ఈ హార్మోన్లతో మానసిక ప్రశాంతత కలుగుతుందని మీకు తెలుసా..?HORMONES;USES{#}chocolate;ManamSun, 16 Jul 2023 19:00:00 GMT ఈ మధ్యకాలంలో చాలామంది డబ్బు,హోదా ఉన్నా సరే మానసిక ప్రశాంతత లేక సతమతమవుతూ ఉన్నారు.ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా దీర్ఘంగా ఆలోచిస్తూ వారి ఆరోగ్యాన్ని వారే దెబ్బతీసుకుంటూ ఉన్నారు.దానికి కారణం కొన్ని రకాల హార్మోన్లు తగ్గుదలేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.కొన్ని రకాల హార్మోన్ల వల్ల మనకు మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా మనం సంతోషంగా జీవించడానికి కూడా ఉపయోగపడతాయి.సంతోషం సగం బలం అని ఊరికే అన్నారా పెద్దలు.సంతోషంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడామెరుగ్గా ఉంటుంది.మరి ఆ హార్మోన్లు ఏంటో,అవి ఎలా ఉత్పత్తి అవుతాయో మనము తెలుసుకుందాం పదండి..

ఆక్సిటోసిన్..

ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మన మానసిక ప్రశాంతతకు చాలా బాగా ఉపయోగపడుతుంది.మనకు నచ్చిన వారితో మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు,పెంపుడు జంతువులతో ఆడుకున్నప్పుడు వంటి సందర్భాలలో రిలీజ్ అవుతూ ఉంటుంది.ఈ ఆక్సిటోసిన్ సరిగా రిలీజ్ కాకపోవడం వల్ల,మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది.కావున ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కలగాలి అంటే,మీకు నచ్చిన వారితో మాట్లాడటం కానీ,మీ పెంపుడు జంతువులతో ఆడుకోవడం కానీ చేయడం చాలా మంచిది.

ఎండార్పిన్లు..

మన శరీరంలో ఎండార్పిన్లు సరిగా రిలీజ్ కాకపోవడం వల్ల డిప్రెషన్, మోడీగా ఉండడం మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.దీని ఉత్పత్తి కోసం డార్క్ చాక్లెట్ తినడం,నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి.మరియు ఎండార్పిన్లు పెయిన్ కిల్లర్స్ గా కూడా చెప్తుంటారు.హార్మోన్ అధికంగా ఉండడం వల్ల నొప్పి వంటి సమస్యలు,తొందరగా తగ్గుముఖం పడతాయి.

డోపమైన్..

డోపమైన్ అనే హార్మోన్ ఊత్పత్తి తగ్గుముఖం పట్టడం వల్ల,సంతోషంగా ఉండలేరు.దీనినే హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు.డోపమైన్ సరిగా ఉత్పత్తి కావడానికి రోజు చల్లనీటి స్నానం,ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించడం,ఎప్పుడు నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ ఉండడం వల్ల,వారు హ్యాపీగా ఉండటమే కాకుండా,వారి యొక్క ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

సెరటోనిన్..

మన శరీరంలో సెరటం ఉత్పత్తి సక్రమంగా జరగకపోవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత కలగదు. కావున ఈ హార్మోన్ సక్రమంగా ఉత్పత్తి కావాలి అంటే,గుడ్లు,చీజ్ వంటి అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>