Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e5e44ef-b16c-4e9e-9039-184f205d5a7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e5e44ef-b16c-4e9e-9039-184f205d5a7d-415x250-IndiaHerald.jpgవిదిషా శ్రీవాస్తవ.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు జనతా గ్యారేజ్ సినిమా గుర్తుకువస్తుంది. చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ వారణాసిలో పుట్టి పెరిగింది. అయినా తెలుగు సినిమాలతోనే వెండితెరకు పరిచయమైంది. మా ఇద్దరి మధ్య (2007), అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, ప్రేమ్ వంటి తెలుగు సినిమాలతో ఈ అందాల తార సినీ కెరీర్‌ ప్రారంభించింది. అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ సినిమా ద్వారా విదిషా చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. తర్వాత శ్రీకాంత్‌తో కలిసి దేవరాయ సినిమాలో రొమాన్స్ చేసింది. దానివల్ల ఆమె కెరీTollywood{#}prem;shanvi;AdiNarayanaReddy;Sanvi Srivatsava;tara;Hindi;marriage;Heroine;Tollywood;Telugu;Husband;Cinemaపండంటి బిడ్డకు జన్మనిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నటి?పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నటి?Tollywood{#}prem;shanvi;AdiNarayanaReddy;Sanvi Srivatsava;tara;Hindi;marriage;Heroine;Tollywood;Telugu;Husband;CinemaSun, 16 Jul 2023 13:30:00 GMTవిదిషా శ్రీవాస్తవ.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు జనతా గ్యారేజ్ సినిమా గుర్తుకువస్తుంది. చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ వారణాసిలో పుట్టి పెరిగింది. అయినా తెలుగు సినిమాలతోనే వెండితెరకు పరిచయమైంది. మా ఇద్దరి మధ్య (2007), అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, ప్రేమ్ వంటి తెలుగు సినిమాలతో ఈ అందాల తార సినీ కెరీర్‌ ప్రారంభించింది. అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ సినిమా ద్వారా విదిషా చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.

తర్వాత శ్రీకాంత్‌తో కలిసి దేవరాయ సినిమాలో రొమాన్స్ చేసింది. దానివల్ల ఆమె కెరీర్ కు పెద్దగా ప్రయోజనం కలగలేదు. చివరికి 2016 లో జనతా గ్యారేజ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి తెలుగు వారికి మరింత దగ్గరైంది. దురదృష్టవశాత్తు ఈ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో మంచి అవకాశాలేవీ రాలేదు. నిజానికి ఆమె జనతా గ్యారేజ్ సినిమా తర్వాత 2016లో సాయక్ పాల్ అనే నాన్‌-ఇండస్ట్రీ పర్సన్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా హిందీ సీరియళ్లలో నటిస్తూ కాలం గడుపుతోంది. ప్రస్తుతం విదిషా భబీజీ ఘర్ పర్ హై! హిందీ సీరియల్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే జులై 11న ఓ పండంటి ఆడబిడ్డకు తాను జన్మనిచ్చానని తాజాగా ప్రకటించింది. దాంతో అభిమానులందరూ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు. అయితే డెలివరీ టైమ్‌కి పది రోజులు ముందుగా కూడా ఆమె సీరియల్‌లో కనిపించి అలరించింది. అంతకుముందు ఆమె తన భర్తతో కలిసి తన బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది.

ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో విదిషా మాట్లాడుతూ తన భర్త సాయక్ పాల్ తమ కుమార్తె కోసం కొన్ని పేర్లను పరిశీలిస్తున్నాడని తెలిపింది. తాను కూడా చాలా పేర్లు ఆలోచిస్తున్నానని, 'ఆద్య' అనే పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నానని వెల్లడించింది.  ఈ పేరు దుర్గాదేవికి పర్యాయపదమని చెప్పింది. ఆద్యలో ఆది అనే పేరు శక్తికి ప్రతీక అని, శివునికి పర్యాయపదమైన పేరు అని కూడా చెప్పుకొచ్చింది. కాగా విదిషా దంపతులు తమ ముద్దుల బిడ్డకు ఏం నామకరణం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇకపోతే లవ్లీ, అడ్డా మూవీల హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ హీరోయిన్ విదిషాకు స్వయానా చెల్లెలు అవుతుంది. శాన్వి ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>