EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan8a246124-c456-4ccc-a48b-645c8f9fe020-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan8a246124-c456-4ccc-a48b-645c8f9fe020-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ మొదలైన తర్వాత రాజకీయ నాయకులకు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ముఖ్యంగా రేపు అధికారంలోకి వచ్చాక ప్రజలు తమ అవసరాల కోసం రాజకీయ నాయకుల గుమ్మం ముందు నిలబడి అడిగే రోజులు పోయాయి. దాంతో వాళ్లు ఈ విధానం మీదే గుర్రుగా ఉన్నారని అంటున్నారు కొంతమంది. వాలంటీర్ల మీద తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే కమ్యూనిస్టు పార్టీకి కూడా కోపం గానే ఉందని సమాచారం. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఆసక్తి లేదని తెలుస్తుంది. మరి వైఎస్ఆర్ కJAGAN{#}Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;local language;MP;Congress;Panchayati;Party;Jagan;kalyanవైసీపీ సహా అందరినీ భయపెడుతున్న జగన్‌ సైన్యం?వైసీపీ సహా అందరినీ భయపెడుతున్న జగన్‌ సైన్యం?JAGAN{#}Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;local language;MP;Congress;Panchayati;Party;Jagan;kalyanSun, 16 Jul 2023 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ మొదలైన తర్వాత రాజకీయ నాయకులకు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ముఖ్యంగా రేపు అధికారంలోకి వచ్చాక  ప్రజలు తమ అవసరాల కోసం రాజకీయ నాయకుల గుమ్మం ముందు నిలబడి అడిగే రోజులు పోయాయి. దాంతో వాళ్లు ఈ విధానం మీదే గుర్రుగా ఉన్నారని అంటున్నారు కొంతమంది. వాలంటీర్ల మీద తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే కమ్యూనిస్టు పార్టీకి కూడా కోపం గానే ఉందని సమాచారం.


అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఆసక్తి లేదని తెలుస్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లందరికీ ఈ వాలంటీర్ విధానం మీద అభిమానం ఉందా అంటే చాలా వరకూ లేదు అని అంటున్నారు కొంతమంది. ఆ పార్టీలోనే పంచాయతీ వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ విధానం మీద లోలోపల మండిపడుతున్నట్లుగా సమాచారం.


ప్రతిపక్షాలకైతే వాలంటీర్లు జగన్ సైన్యం లా కనిపిస్తున్నారని తెలుస్తుంది. అధికారంలో ఉన్న వాళ్లయితే ప్రజలు వాలంటీర్లకు ఇస్తున్న విలువ తమకు ఇవ్వడం లేదని వాపోతున్నారని సమాచారం. ఇలా స్థానిక సంస్థల పరిధిలో ఎమ్మెల్యేలతో సహా క్రింద పనిచేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇలా అందరూ వాలంటీర్ల వ్యవస్థపై అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వీళ్ళు ఎవరూ కూడా డైరెక్టుగా నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పలేక మింగ లేక, కక్కలేక ఉండిపోతున్నారు అని సమాచారం.


అయితే వీళ్ళందరి అభిప్రాయాలను, గుండెలోని కసిని తన మాట ద్వారా వెల్లడిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ స్టెప్ పై ఆయనకు వైయస్సార్సీపి తప్ప అన్ని పార్టీల సపోర్టు ఉన్నట్లుగా సమాచారం. కానీ ఆల్రెడీ ప్రజల్లో మమేకమైపోయిన వాలంటీర్ విధానం నడ్డి విరగగొడతాను అంటున్న పవన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

నమ్రత పోస్ట్ చేసిన పిక్స్ చూసి సరదాగా కామెంట్స్ చేస్తున్న అమ్మాయిలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>