Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yashashwiaa792c67-41c2-49b7-bf85-b8eec1e8602b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yashashwiaa792c67-41c2-49b7-bf85-b8eec1e8602b-415x250-IndiaHerald.jpgయశస్వి జైస్వాల్.. గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు దేశవాళీ క్రికెట్లో అతను సృష్టించిన బ్యాటింగ్ విధ్వంసం గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. ఏ టోర్నీలో అతను బరిలోకి దిగిన సెంచరీ చేయకుండా వెను తిరగడు అంటూ అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇది నిజమే అన్న విషయాన్ని మరోసారి ఐపీఎల్లో నిరూపించాడు యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన యశస్వి జైష్వాల్ సెంచరీల మోత మోగించాడు అని చెప్పాలి. సీనియర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలYashashwi{#}Rajasthan;West Indies;Yashasvi Jaiswal;Fidaaఅరంగేట్రంలోనే సెంచరీ.. జైస్వాల్ అరుదైన రికార్డ్?అరంగేట్రంలోనే సెంచరీ.. జైస్వాల్ అరుదైన రికార్డ్?Yashashwi{#}Rajasthan;West Indies;Yashasvi Jaiswal;FidaaFri, 14 Jul 2023 10:00:00 GMTయశస్వి జైస్వాల్.. గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు దేశవాళీ క్రికెట్లో అతను సృష్టించిన బ్యాటింగ్ విధ్వంసం గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. ఏ టోర్నీలో అతను బరిలోకి దిగిన సెంచరీ చేయకుండా వెను తిరగడు అంటూ అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇది నిజమే అన్న విషయాన్ని మరోసారి ఐపీఎల్లో నిరూపించాడు యశస్వి జైస్వాల్.  రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన యశస్వి జైష్వాల్ సెంచరీల మోత మోగించాడు అని చెప్పాలి.


 సీనియర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమవుతూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న వేళ పెద్దగా అనుభవం లేని ఈ యంగ్ బ్యాటర్ మాత్రం తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. దీంతో తన బ్యాటింగ్ శైలితో ఏకంగా సెలెక్టర్లను సైతం ఫిదా చేసేశాడు. ఇంకేముంది ఐపీఎల్ ముగిసిందో లేదో అంతలోనే వెస్టిండీస్ పర్యటన లో భాగంగా టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఇలా టీమిండియాలోకి వచ్చి పోయే ఆటగాళ్లు చాలామంది ఉంటారు అని యశస్వి జైష్వాల్ గురించి కూడా అందరూ అనుకున్నారు.


 కానీ తాను వచ్చి పోయే ఆటగాడిని కాదు పాతుకుపోయే ఆటగాడిని అన్న విషయాన్ని మొదటి మ్యాచ్ తోనే నిరూపించాడు. మొదటి మ్యాచ్ లోనే సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు యశస్వి జైష్వాల్. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. 215 బంతుల్లో 11 ఫోర్ ల సహాయంతో శతకం సాధించాడు. అయితే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 17వ భారత బ్యాట్స్మెన్ గా యశస్వి జైస్వాల్  నిలిచాడు. ఇక తక్కువ వయసులోనే సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 21 సంవత్సరాల 196 రోజుల వయసులో సెంచరీ చేశాడు. ఇంతకంటే ముందు పృథ్విషా, అబ్బాస్, గుండప్ప విశ్వనాథ్ తక్కువ వయసులోనే సెంచరీలు చేసి తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>