MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bharatheeyans-movie630d1f08-791c-46e9-84bb-34184568addf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bharatheeyans-movie630d1f08-791c-46e9-84bb-34184568addf-415x250-IndiaHerald.jpgతెలుగులో ఇప్పటికే ఎన్నో దేశభక్తి చిత్రాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు చాలా వరకు కూడా సక్సెస్ ని సాధించాయి. మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మరొక దేశభక్తి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధీన రాజ్ దర్శకత్వంలో భారతీయన్స్ అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాను శంకర్ నాయుడు నిర్మించారు. Bharatheeyans Movie{#}Box office;Punjabi;Indian;raj;Pakistan;shankar;Music;Success;producer;Producer;Cinemaభారతీయన్స్ రివ్యూ.. దేశభక్తిని తట్టిలేపే చిత్రం!భారతీయన్స్ రివ్యూ.. దేశభక్తిని తట్టిలేపే చిత్రం!Bharatheeyans Movie{#}Box office;Punjabi;Indian;raj;Pakistan;shankar;Music;Success;producer;Producer;CinemaFri, 14 Jul 2023 10:13:43 GMTతెలుగులో ఇప్పటికే ఎన్నో దేశభక్తి చిత్రాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు చాలా వరకు కూడా సక్సెస్ ని సాధించాయి. మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మరొక దేశభక్తి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధీన రాజ్ దర్శకత్వంలో భారతీయన్స్ అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాను శంకర్ నాయుడు నిర్మించారు.  

కథ

మామూలుగా ఎటువంటి సినిమా తీసుకున్న కూడా అందులో పాత్రుల పేర్లు ఉండటం సహజం. కానీ ఈ కథలో పాత్రల పేర్లు ఉండవు. ప్రాంతాల పేర్లతో మాత్రమే పాత్రలను పిలుస్తుంటారు. అలా భోజ్ పురి, తెలుగు, నేపాలి, బెంగాలి, త్రిపుర, పంజాబీ లకు చెంది ఆరుగురు ఒకే చోటకు చేరుతారు. వాళ్లందరికీ ట్రైనింగ్ ఇస్తారు. చివరకు వారిని ఇండియన్ బార్డర్ దాటి చైనాలోకి వెళ్లమని చెబుతారు. అక్కడి గెస్ట్ హౌస్‌లోని ల్యాబ్‌లో ఏం జరుగుతోంది? అక్కడి సీక్రెట్లు ఏంటి? అనేది తెలుసుకుని రావాలని చెబుతారు. అసలు ఆ ఆరుగురు ఒకే చోటకు ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వారికి ట్రైనింగ్ ఇచ్చిన వారు ఎవరు? చైనా వాడు వేసిన ఎత్తు ఏంటి? చివరకు ఈ ఆరుగురు ఏం చేశారు? ఈ ప్రశ్నలు అన్నింటికి   సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు

 ఇందులో భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర, తెలుగు, బెంగాలి లు నటించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసి అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లోనూ మెప్పించారు.

విశ్లేషణ

 ఈ సినిమాను సరిహద్దు సమస్యలు ఉగ్రవాద కుట్రలు చైనా పాకిస్తాన్ ఇండియా అనే అంశాల మీద తెరకెక్కించారు డైరెక్టర్. అయితే ఈ దేశ భక్తి సినిమాను ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి.

ప్రథమార్థం అంతా కూడా పాత్రల పరిచయం, వారి వారి నేపథ్యాలు చూపించడంతో గడిచింది. ద్వితీయార్థంలోనే అసలు కథ, ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి పది నిమిషాలు దేశ భక్తి రగిల్చేలా ఉంటుంది. అయితే ఇందులో క్లైమాక్స్ కోసం బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిందే. ప్రాంతాలు భాషలు వేరైనా కూడా మనమంతా భారతీయులమని చాటి చెప్పే చిత్రమే భారతీయన్స్.

 ఇకపోతే సాంకేతికత విషయానికి వస్తే.. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా చూపించారు కెమెరామెన్. సంగీతం బాగుంది. ఆర్ఆర్‌తో కొన్ని సీన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది.

రేటింగ్ 3/5



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>